సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ చంద్రముఖి ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2005లో రిలీజైన ఈ సినిమాలో జ్యోతిక నటన, లకలక అంటూ వెరైటీగా ఇచ్చిన రజిని మ్యానరిజంస్, విద్యాసాగర్ పాటలు ఒకటా రెండా అన్ని అంశాలు మూకుమ్మడిగా పని చేసే దాన్ని ఇండస్ట్రీ హిట్ చేసేశాయి. అప్పట్లో తెలుగు వెర్షన్ సైతం వంద రోజులు ఆడిందంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ […]
ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ లో కొత్త సినిమాలకు పెద్ద రేటింగ్ రావడమే గగనం. అలాంటిది 22 ఏళ్ళ క్రితం వచ్చిన మూవీకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని మించిన రెస్పాన్స్ వస్తే ఎలా ఉంటుంది. అది ఒక్క సూపర్ స్టార్ రజనీకాంత్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో. ఇటీవలే సన్ టీవీలో నరసింహ తమిళ వెర్షన్ పడయప్పాను టెలికాస్ట్ చేశారు. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా. ఇది ఏడేళ్ల తర్వాత అక్కడి ఛానల్ లో ప్రీమియర్ అయ్యింది. అదే రోజు […]
స్టార్ హీరో ఇమేజ్ మీద ఆధారపడి కమర్షియల్ సినిమా కొన్ని సూత్రాలకు అనుగుణంగా నడిచే మాట నిజమే అయినా మాస్ కి ఇలాంటివన్నీ నచ్చుతాయన్న గ్యారంటీ లేదు. తమను మెప్పించేలా కథాకథనాలు చెప్పకపోతే నిర్మొహమాటంగా తిప్పి కొడతారు. ఇక్కడ కాంబోలు అదనపు హంగులు ఏవీ పనిచేయవు. దానికి ఉదాహరణగా ‘రాముడొచ్చాడు’ చెప్పుకోవచ్చు. 1995. హలో బ్రదర్, ఘరానా బుల్లోడు తర్వాత నాగార్జునను ఊహించని పరాజయాలు పలకరించాయి. ‘క్రిమినల్’ యావరేజ్ దగ్గరే ఆగిపోగా క్రేజీగా వచ్చిన ‘వజ్రం’ దారుణంగా […]
సాధారణంగా అన్నా చెల్లి తమ్ముడు వదిన లాంటి టైటిల్స్ ఉన్న సినిమాలు అధిక శాతం సెంటిమెంట్ ని ఆధారంగా చేసుకుని భావోద్వేగాలను ప్రేరేపించే విధంగా ఉంటాయి. ఎంటర్ టైన్మెంట్ కి చోటు తక్కువ. కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా ఎక్కువ ఇరికించలేం. కానీ చిరంజీవి లాంటి ఎవరెస్టు ఇమేజ్ ఉన్న హీరోతో చేసేటప్పుడు లెక్కలన్నీ పక్కాగా బేరీజు వేసుకోవాలి. ముఖ్యంగా అభిమానుల అంచనాలను తప్పకుండా చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుందో రాఘవేంద్రరావు తీసిన ‘ఇద్దరు మిత్రులు’ అప్పటికే ఋజువు […]
హీరో అజ్ఞాతంలో ఉంటూ బయటికి కనిపించకుండా విలన్ల భరతం పట్టే కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసినవి మాత్రం తక్కువే. 1996లో ‘భారతీయుడు’ విజయం కొత్త తరహా ఆలోచనలకు ఆజ్యం పోసింది. సమాజంలో తప్పులు, నేరాలు చేసినవాళ్లకు ఒక సామాన్యుడు అందులోనూ వృద్ధుడు శిక్షలు వేయడాన్ని జనం బ్రహ్మాండంగా ఆదరించారు. దాన్ని ఇంకో కోణంలో అలోచించి దర్శకుడు తిరుపతిస్వామి 2000 సంవత్సరంలో తీసిన చిత్రమే ఆజాద్. ఆసుపత్రుల్లో జరిగే దురాగతాలను […]
ఈ నెల 10న నందమూరి బాలకృష్ణ బర్త్ డే. 60వ వసంతంలోకి అడుగుపెట్టనుండటంతో అభిమానులు చాలా స్పెషల్ గా దీన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో చిరంజీవి సైతం ఇదే తరహాలో ఇండస్ట్రీ బిగ్ షాట్స్ ని పిలిచి గ్రాండ్ పార్టీ చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఆ రోజు బాలయ్య ఫ్యాన్స్ కు ఓ అరుదైన కానుకను ఇవ్వబోతున్నారు వాళ్ళ అభిమాన హీరో. 2004లో బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో మొదలుపెట్టిన నర్తనశాల అందులో ద్రౌపదిగా నటిస్తున్న సౌందర్య […]
ఆల్ ఇండియా మెగాస్టార్ గా పిలివబడే బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశం లేదా దర్శకత్వం వహించే ఛాన్స్ కన్నా ఎవరైనా కోరుకునేది ఏముంటుంది. అందుకే తన ముప్పై ఏళ్ళ సినిమా కెరీర్ తర్వాత చిరంజీవి ఏరికోరి మరీ సైరా రూపంలో ఆ ముచ్ఛట తీర్చుకున్నారు. నాగార్జునకు ఖుదాగవా రూపంలో తీరింది కానీ బాలకృష్ణ, వెంకటేష్ లకు మాత్రం ఇంకా ఆ ఛాన్స్ దక్కలేదు. నటి సౌందర్యకు ఆ అదృష్టం 1999లో దొరికింది. […]
చియాన్ గా అభిమానులతో ముద్దుపేరుతో పిలిపించుకునే హీరో విక్రమ్ టాలెంట్ తెలుగు వాళ్లకు తెలిసింది అపరిచితుడుతోనే. ఆ సినిమా ప్రభావం వల్ల చాలా ఏళ్ళ పాటు ఇతని చిత్రాలు డబ్బింగ్ రూపంలో వస్తూనే ఉన్నాయి.తమిళ్ లో స్టార్ హీరోగా ఎదిగే క్రమంలో విక్రమ్ చేసిన ఛాలెంజింగ్ రోల్స్ ఎన్నో ఉన్నాయి. 1990లో పరిశ్రమలో అడుగు పెట్టిన విక్రమ్ కెరీర్ ప్రారంభంలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే తెలుగు స్ట్రెయిట్ మూవీస్ చేశాడు కాని అవేవి ఆశించిన ఫలితాన్ని కానీ పేరుని […]
ఫ్యాక్షన్ సినిమాలు తెలుగులో ఎన్ని వచ్చినప్పటికీ వాస్తవికత విషయంలో కృష్ణవంశీ తీసిన అంతఃపురం అన్నింటి కన్నా ముందుంటుంది. అసలు హీరోనే లేకుండా ఫిమేల్ ఓరియెంటెడ్ గా దీన్ని మలచిన తీరు అద్భుతం. ప్రీ క్లైమాక్స్ కు ముందు వచ్చే జగపతి బాబు పాత్ర మినహా ఇంకే మేల్ డామినేషన్ హీరో యాంగిల్ లో క్యారెక్టర్ పరంగా ఎక్కడా కనిపించదు. అంత సహజ రీతిలో సహజనటి సౌందర్య తన రోల్ కి ప్రాణ ప్రతిష్ట చేశారు. 1998లో వచ్చిన […]