Mithra Mandali Movie Review: ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, నిహారిక.ఎన్.ఎమ్నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మిత్రమండలి. దీపావళి రేస్ లో ఈ సినిమా కూడా యూత్ ను టార్గెట్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది. అయితే ముందుజాగ్రత్తగా ఓ రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ తో థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా అనుకున్నట్టుగా ఆడియన్స్ ను మెప్పించిందా లేదా అనేది మూవీ రివ్యూ లో చూసేద్దాం.
Mithra Mandali Movie Review: ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, నిహారిక.ఎన్.ఎమ్నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మిత్రమండలి. దీపావళి రేస్ లో ఈ సినిమా కూడా యూత్ ను టార్గెట్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది. అయితే ముందుజాగ్రత్తగా ఓ రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ తో థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా అనుకున్నట్టుగా ఆడియన్స్ ను మెప్పించిందా లేదా అనేది మూవీ రివ్యూ లో చూసేద్దాం.
Swetha
ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, నిహారిక.ఎన్.ఎమ్నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మిత్రమండలి. దీపావళి రేస్ లో ఈ సినిమా కూడా యూత్ ను టార్గెట్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది. అయితే ముందుజాగ్రత్తగా ఓ రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ తో థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా అనుకున్నట్టుగా ఆడియన్స్ ను మెప్పించిందా లేదా అనేది మూవీ రివ్యూ లో చూసేద్దాం.
కథ :
జంగ్లీపట్నానికి చెందిన వీటీవీ గణేశ్‌కు క్యాస్ట్ పిచ్చి బాగా ఎక్కువ. ఆ ఏరియా ఎం.ఎల్. సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటాడు.ఇక కులాంతర వివాహాలైతే అస్సలు ఒప్పుకోడు. ఓసారి నారాయణ కూతురు నిహారిక ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని భావించి, తన కూతురు కిడ్నాప్ అయ్యిందని.. వెన్నెల కిషోర్ తో కలిసి డ్రామా ఆడటం మొదలుపెడతాడు. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ద్వారా స్వేచ్ఛ మిస్సింగ్ వెనుక నలుగురు మిత్రులు ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓ.ఐ, ప్రసాద్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నలుగురిలో ఒకరికోసం నిహారిక బయటకు వచ్చిందా ? ఆమె వలన మిగిలిన వారు ఎలాంటి ఇబ్బందులు పడతారు ? చివరికి ఏమైంది ? అనేది తెలియాలంటే వెండితెరమీద చూడాల్సిందే.
నటీనటులు, టెక్నీకల్ టీం పనితీరు :
ఈ సినిమాలో మెయిన్ హీరో ప్రియదర్శి . అయినా సరే, నలుగురు ఫ్రెండ్స్ లో ఒకరిగానే కనిపిస్తాడు. అందరూ వారి వారి పాత్రలకు తగినట్టు న్యాయం చేసినా కానీ..కామిడి సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం కాస్త మైనస్ అయింది. ఇక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో వచ్చిన సత్య ఇంపాక్ట్ బాగానే కనిపించింది. వీరు ఐదుగురు కాకుండ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన నిహారికకు సూట్ అయ్యే పాత్ర కాదేమో అని కొన్ని చోట్ల అనిపిస్తూ ఉంటుంది. వెన్నెల కిషోర్ ఎప్పటిలానే తన కామెడీతో నవ్వించాడు. ఇక టెక్నీకల్ టీం విషయానికొస్తే కథ పరంగా బాగానే ఉన్నా కూడా.. దానిని తెరమీదకు తీసుకురావడంలో ఇక్కడ దర్శకుడు ఫెయిల్ అయ్యాడేమో అనే ఆలోచన రాకుండా పోదు. డైలాగ్స్ , పంచ్ లైన్స్ బాగానే పేలాయి. సినిమాటోగ్రపీ కూడా బాగానే వర్క్ అవుట్ అయింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ , పాటలు కూడా తెరమీద బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బావుండేదని అనిపించక మానదు.
విశ్లేషణ :
సినిమాలో ప్రత్యేకించి కథ ఏమి ఉండదని.. సినిమాలో వారితో పాటు దర్శకనిర్మాతలు కూడా ముందే చెప్పేశారు. కాసేపు సినిమా చూసి సరదాగా నవ్వుకుని వెళ్లేలా ఉంటుందని చెప్పారు. ఇంత చెప్పినా కూడా సినిమా ఆడియన్స్ ను ష్యుర్ గా మెప్పించలేకపోయింది. కంప్లీట్ గా ఎంజాయ్ చేయలేకపోయారు. మొదట్లో కాస్త సెటైరికల్ గా అనిపించినా.. అసలు కథ మొదలైనప్పటినుంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. నలుగురు ఫ్రెండ్స్ పరిచయం , వాళ్ళు చేసే కామిడి అంతా అలా సాగిపోతూ ఉంటుంది. కానీ అది ఆడియన్స్ ను అంతగా నవ్వించలేకపోయింది. ఓ క్యాస్ట్ ను క్రియేట్ చేసి దాని చుట్టూ కామిడి లేయర్స్ ను రాసుకున్నారు. కానీ అవి రాతలు వరకు బాగానే ఉన్నా.. తెరమీద నవ్వులు పూయించలేకపోయాయి. ఫస్ట్ ఆఫ్ అంతా సరదాగా సాగిపోతుంది. సెకండ్ ఆఫ్ అంతా కాస్త బోరింగ్ అనిపిస్తుంది. ఫైనల్ గా సినిమా ఒకే పరవాలేదని అనిపిస్తుంది.
రేటింగ్ : 2.5/5
చివరిగా : సరదాగా కొంతసేపు నవ్వించిన మిత్రమండలి