Venkateswarlu
Venkateswarlu
మనిషి జీవితం చాలా చిన్నది.. ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఎవ్వరమూ చెప్పలేము. కోట్లు సంపాదించినా.. కోట్ల మంది అభిమానాన్ని సంపాదించినా చివరకు మట్టిలో కలిసిపోవాల్సిందే. మనం సాధించిన దాన్ని బట్టి.. జనం మనల్ని గుర్తు పెట్టుకోవటమో.. మర్చిపోవటమో జరుగుతుంది. చనిపోయినా కూడా జనం గుండెల్లో నిలిచిపోయే అవకాశం సినిమా వాళ్లకే ఎక్కువగా ఉంటుంది. అలా పైన ఫొటోలో కనిపిస్తున్న పాప కూడా సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమాలు చేసింది.
తెలుగు, తమిళం,కన్నడ భాషల్లో కొన్ని లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకుంది. స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో అనుకోని విధంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయింది. ఆమె చనిపోయి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా.. సినిమా ప్రేక్షకులు ఆమెను మర్చిపోలేదు. ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఆమె ఎవరన్నది. ఆమె ఇంకెవరో కాదు.. అందాల తార సౌందర్య. ఆమె 1976 జులై 18న మైసూరులో పుట్టారు. 1992లో వచ్చిన ‘గంధర్వ’ సినిమాతో ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మరుసటి ఏడాది ‘ మనవరాలి పెళ్లి’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.
తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పలు భాషల్లో సినిమాలు చేశారు. సినిమాల్లో స్టార్‌గా వెలుగొందుతున్న సమయంలో 2003లో తన చిన్ననాటి మిత్రుడు రఘును పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాది తన సోదరుడి కోసం ఎన్నికల ప్రచారానికి హెలికాఫ్టర్‌లో తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. దీంతో అందులోని ముగ్గురు సజీవ దహనం అయ్యారు.