iDreamPost
android-app
ios-app

దీపావళి పోటీలో అరి.. థియేటర్ లో దర్శకుడు జయ శంకర్

  • Published Oct 20, 2025 | 2:09 PM Updated Updated Oct 20, 2025 | 2:09 PM

ప్రస్తుతం ఓ సినిమా ఒక వారం ఆడితేనే గొప్ప అని చెప్పుకునేలా మారింది. పెద్ద చిత్రాలు కూడా వీకెండ్ వరకే హవాను చూపిస్తున్నాయి. పాజిటివ్ మౌత్ టాక్ వస్తే గానీ ఓ వారం, రెండు వారాలు చిత్రాలు ఆడటం లేదు. అలాంటిది గత వారం వచ్చిన నాలుగు చిత్రాల్లో ‘అరి’ మూవీ రెండో వారంలోకి కూడా అడుగు పెట్టేసింది.

ప్రస్తుతం ఓ సినిమా ఒక వారం ఆడితేనే గొప్ప అని చెప్పుకునేలా మారింది. పెద్ద చిత్రాలు కూడా వీకెండ్ వరకే హవాను చూపిస్తున్నాయి. పాజిటివ్ మౌత్ టాక్ వస్తే గానీ ఓ వారం, రెండు వారాలు చిత్రాలు ఆడటం లేదు. అలాంటిది గత వారం వచ్చిన నాలుగు చిత్రాల్లో ‘అరి’ మూవీ రెండో వారంలోకి కూడా అడుగు పెట్టేసింది.

  • Published Oct 20, 2025 | 2:09 PMUpdated Oct 20, 2025 | 2:09 PM
దీపావళి పోటీలో అరి.. థియేటర్ లో దర్శకుడు జయ శంకర్

ప్రస్తుతం ఓ సినిమా ఒక వారం ఆడితేనే గొప్ప అని చెప్పుకునేలా మారింది. పెద్ద చిత్రాలు కూడా వీకెండ్ వరకే హవాను చూపిస్తున్నాయి. పాజిటివ్ మౌత్ టాక్ వస్తే గానీ ఓ వారం, రెండు వారాలు చిత్రాలు ఆడటం లేదు. అలాంటిది గత వారం వచ్చిన నాలుగు చిత్రాల్లో ‘అరి’ మూవీ రెండో వారంలోకి కూడా అడుగు పెట్టేసింది. ఇక ఈ వారం దీపావళి సీజన్ సందర్భంగా నాలుగు కొత్త చిత్రాలు బరిలోకి దిగాయి.

ఈ వారం రానున్న నాలుగు కొత్త చిత్రాలతో పాటుగా అరి కూడా రెండో వారంలో కంటిన్యూ కాబోతోంది. ఈ ఏసియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రానికి సూపర్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. మీడియా, సోషల్ మీడియాలో అరి సినిమా మీద పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మెల్లిగా ఈ మూవీ పికప్ అవుతోందని సమాచారం. అందుకే ఈ చిత్రాన్ని రెండో వారం కూడా కంటిన్యూ చేస్తున్నారు.

దీపావళి సందర్భంగా నాలుగు కొత్త చిత్రాలు (మిత్ర మండలి, డ్యూడ్, తెలుసు కదా, కె ర్యాంప్) బరిలోకి దిగాయి. అయినా కూడా అరి ఈ రెండో వారంలో కొనసాగుతోంది. కొత్త చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చేలా అరి మూవీ కనిపిస్తోంది. పదో రోజు కూడా అరికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని దర్శకుడు జయ శంకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పదో రోజు సినిమాని వీక్షిస్తున్నట్టు జయ శంకర్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

అరి కంటెంట్ బేస్డ్ మూవీ కావడంతో రెండో వారం కూడా కొనసాగించాలని మేకర్లు ఫిక్స్ అయ్యారు. అసలు ఈ మూవీ కోసం ఆర్టిస్టులంతా కలిసి ముందుకు వచ్చి ప్రమోట్ చేస్తే నెక్ట్స్ లెవెల్లో ఉండేది. ఆడియెన్స్‌లోకి మరింత ఎక్కువగా వెళ్లే అవకాశం ఉండేది. మరి ఈ రెండో వారంలోనూ అరిని మేకర్లు ప్రమోట్ చేసి ఆడియెన్స్‌లోకి మరింతగా వెళ్తారా? లేదా? అన్నది చూడాలి.

‘పేపర్ బాయ్’ లాంటి ఓ సెన్సిబుల్ లవ్ స్టోరీతో మెప్పించిన జయ శంకర్.. ఇప్పుడు ‘అరి’ అని ఆకట్టుకున్నాడు. ఇంత వరకు రానటువంటి అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌ను తీసుకుని మంచి సందేశాన్ని ఇస్తూ అరి చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీలోని క్లైమాక్స్, చివరి నిమిషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుత సమాజానికి అవసరమయ్యే మంచి సందేశాన్ని ఇస్తూ తీసిన అరి మూవీ ఇప్పుడు రెండో వారంలోకి అడుగు పెట్టింది. మరి ఈ వీక్‌లో అరి కొత్త చిత్రాలతో ఏ మేరకు పోటీ పడుతుందో చూడాలి.

వరుసగా రెండు అద్భుతమైన కంటెంట్ బేస్డ్ సినిమాలు అందించిన జయ శంకర్.. రానున్న మూడో మూవీపై అంచనాలు పెంచేసినట్టు అయింది.

 

View this post on Instagram

 

A post shared by Jayashankarr (@jayashankarr_)