iDreamPost
android-app
ios-app

Krishna Vamsi: ‘అసలేం గుర్తుకు రాదు’ పాటలో సౌందర్య చీర రంగులు మారడం తన ప్లాన్ కాదట.. సీక్రెట్ రివీల్ చేసిన కృష్ణవంశీ!

  • Published Jul 21, 2024 | 1:22 PM Updated Updated Jul 21, 2024 | 1:22 PM

'అసలేం గుర్తుకు రాదు' సాంగ్ చాలా మందికి ఫేవరెట్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సాంగ్ లో సౌందర్య చీర రంగులు మారుతూ ఉంటుంది. ఇది అప్పట్లో ఆడియెన్స్ ను భలే అట్రాక్ట్ చేసింది. అయితే ఈ ఐడియా నాది కాదు అంటూ అసలు సీక్రెట్ రివీల్ చేశాడు డైరెక్టర్ కృష్ణవంశీ. ఆ వివరాల్లోకి వెళితే..

'అసలేం గుర్తుకు రాదు' సాంగ్ చాలా మందికి ఫేవరెట్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సాంగ్ లో సౌందర్య చీర రంగులు మారుతూ ఉంటుంది. ఇది అప్పట్లో ఆడియెన్స్ ను భలే అట్రాక్ట్ చేసింది. అయితే ఈ ఐడియా నాది కాదు అంటూ అసలు సీక్రెట్ రివీల్ చేశాడు డైరెక్టర్ కృష్ణవంశీ. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 21, 2024 | 1:22 PMUpdated Jul 21, 2024 | 1:22 PM
Krishna Vamsi: ‘అసలేం గుర్తుకు రాదు’ పాటలో సౌందర్య చీర రంగులు మారడం తన ప్లాన్ కాదట.. సీక్రెట్ రివీల్ చేసిన కృష్ణవంశీ!

‘మురారి’.. మహేశ్ బాబు-కృష్ణవంశీ డైరెక్షన్ లో 2001లో వచ్చి.. సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇక ఇందులో మహేశ్ కు జోడీగా సోనాలి బింద్రే నటించగా.. మెలోడి బ్రహ్మ మణిశర్మ బాణీలు అందించాడు. అప్పట్లో ఈ మూవీ ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచి,  మహేశ్ బాబు, కృష్ణవంశీ కెరీర్లో మరపురాని చిత్రంగా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు మళ్లీ ఆ క్లాసిక్ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నారు మేకర్స్. మహేశ్ బర్త్ డే(ఆగస్ట్ 9)న మురారి సినిమాను థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణవంశీ ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో చిట్ చాట్ చేశాడు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ‘అంతఃపురం’ మూవీలో ‘అసలేం గుర్తుకు రాదు’ పాటలో సౌందర్య కట్టుకున్న చీర రంగులు మారుతుంది. ఆ ఐడియా ఎవరిది? అదెలా జరిగిందో చెప్పుకొచ్చాడు ఈ స్టార్ డైరెక్టర్.

‘అంతఃపురం’.. 1998లో వచ్చిన ఈ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. కృష్ణవంశీ డైరెక్షన్ లో ప్రకాశ్ రాజ్, సౌందర్య, జగపతి బాబు, సాయి కుమార్ కీలక పాత్రల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. ఇక ఈ మూవీలో సాయి కుమార్-సౌందర్య మధ్య సాగే రొమాంటి సాంగ్ ‘అసలేం గుర్తుకు రాదు’ పాట ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ పాట అంటే ఎంతో మందికి ఫేవరెట్. అయితే ఈ సాంగ్ లో ఓ ప్రత్యేక ఉంది, అదేంటంటే? సౌందర్య కట్టుకున్న చీర రంగులు మారుతూ ఉంటుంది. ఇది అప్పట్లో ప్రేక్షకులకు భలే అనిపించింది. ఈ ఐడియా ఎలా వచ్చింది? అని తాజాగా డైరెక్టర్ కృష్ణవంశీని ఓ నెటిజన్ అడిగాడు. దాంతో అసలు విషయం బయటపెట్టాడు క్రియేటీవ్ దర్శకుడు.

మహేశ్ బాబు బర్త్ డే కానుకగా ఆగస్ట్ 9న మురారి మూవీని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణవంశీ ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ప్రశ్నిస్తూ..”అంతఃపురం మూవీలో ‘అసలేం గుర్తుకు రాదు’ పాటలో సౌందర్య చీర రంగులు మారడం భలే అనిపించిందండి. అప్పట్లో ఇది కొత్తగా ఉంది. ఈ ఐడియా మీకెలా వచ్చింది?” అని అడిగాడు. దానికి..”అది సినిమాలో లేదండీ.. రిలీజ్ తర్వాత జెమీని టీవీలో ఎడిటర్ చేశాడు” అంటూ రెడ్ హార్ట్ గుర్తుతో పాటుగా దండం పెట్టే ఎమోజీని యాడ్ చేశాడు కృష్ణవంశీ. దాంతో అసలు విషయం తెలిసి నెటిజన్లు షాక్ అయ్యారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişasyabahis girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom