iDreamPost
android-app
ios-app

అంతఃపురం మూవీ చైల్ట్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరో అయ్యాడని తెలుసా?

  • Published Jul 28, 2024 | 12:00 AM Updated Updated Jul 28, 2024 | 12:00 AM

Anthahpuram Child Artist.. కృష్ణవంశీ తెరకెక్కించి ది బెస్ట్ చిత్రాల్లో ఒకటి అంతఃపురం. ప్రకాష్ రాజ్, సౌందర్య, జగపతి బాబు, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఇందులో సాయి కుమార్- సౌందర్య బిడ్డగా నటించిన చిన్నారి గుర్తున్నాడా.. అతడు ఎలా ఉన్నాడో తెలుసా..

Anthahpuram Child Artist.. కృష్ణవంశీ తెరకెక్కించి ది బెస్ట్ చిత్రాల్లో ఒకటి అంతఃపురం. ప్రకాష్ రాజ్, సౌందర్య, జగపతి బాబు, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఇందులో సాయి కుమార్- సౌందర్య బిడ్డగా నటించిన చిన్నారి గుర్తున్నాడా.. అతడు ఎలా ఉన్నాడో తెలుసా..

  • Published Jul 28, 2024 | 12:00 AMUpdated Jul 28, 2024 | 12:00 AM
అంతఃపురం మూవీ చైల్ట్ ఆర్టిస్ట్  గుర్తున్నాడా? ఇప్పుడు హీరో అయ్యాడని తెలుసా?

వర్సటైల్ దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో ఆయన రూపొందించిన రెండు సినిమాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఒకటి మహేష్ బాబు హీరోగా తెరకెక్కించిన మురారి. మరోటీ అంత: పురం. ఆగస్టు 9వ తేదీన మురారీ రీ రిలీజ్ అవుతున్న సంగతి విదితమే. దీని కోసం స్పెషల్ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పాడు డైరెక్టర్. అదే అంతఃపురంలో అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా సాంగ్‌లో సౌందర్య చీరల కలర్స్ మారడం భలేగా అనిపించిందని, ఆ క్రియేటివ్ ఐడియా ఎలా వచ్చిందంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అబ్బే అది నా క్రెడిట్ కాదు.. జెమినీ ఛానల్ ఎడిటర్ క్రియేటివిటీ అంటూ వెల్లడించాడు. దీంతో వార్ని అనుకున్నారంతా.

ఇక ఈ మూవీ విషయానికి వస్తే.. కృష్ణ వంశీ తీసిన ది బెస్ట్ చిత్రాల్లో ఆణిముత్యం అని చెప్పొచ్చు. 1998లో వచ్చిన ఈ మూవీ కమర్షియల్ హిట్ కావడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు ఉంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించాడు దర్శకుడు. సాయి కుమార్, ప్రకాష్ రాజ్, సౌందర్య, జగపతి బాబు, శారద, తెలంగాణ శకుంతల తదితరులు నటించారు. ఇళయ రాజా అందించిన మ్యూజిక్ ఈ మూవీకే హైలెట్. పాటలు వీనుల విందుగా ఉంటాయి. ఆనందీ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో నందులను అందుకుంది. అలాగే ప్రకాష్ నటనకు జాతీయ అవార్డు కూడా దక్కింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా జగపతి బాబు, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ కేటగిరీలో ప్రకాష్ రాజ్, తెలంగాణ శకుంతల, స్పెషల్ జ్యూరీ అవార్డ్ కేటగిరిలో సౌందర్య, బెస్ట్ చైల్ట్ ఆర్టిస్టుగా కృష్ణ ప్రదీప్ నంది అవార్డులు అందుకున్నారు. ఉత్తమ సినిమాగా కూడా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది అంతఃపురం.

ఈ సినిమాలో సాయి కుమార్- సౌందర్యల కొడుకుగా నటించిన బాబు గుర్తున్నాడా..? కొడుకు లేకపోవడంతో వారసత్వం కోసం మనవడ్ని తీసుకుని.. కోడల్ని ఇబ్బంది పెడుతుంటాడు ప్రకాష్ రాజ్. మనవడు-తాత చుట్టూ కథ అల్లుకుని ఉంటుంది. ఇందులో తన ముద్దు ముద్దు నటనతో ఆకట్టుకున్నాడు బుడతడు. ఇంట్లో నుండి పారిపోయే క్రమంలో తల్లి సౌందర్య సొమ్మ సిల్లి పడిపోగా.. నీళ్లు తీసుకు వచ్చి చిలకరిస్తాడు. నటన అంటే ఏంటో తెలియని వయస్సులోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆ బాబు ఎంతలా మారిపోయాడో తెలుసా.? హీరో అయ్యాడని తెలుసా..? తస్మదీయుడు అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించాడు. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హల్ చల్ చేస్తున్నాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio