ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వార్డు సచివాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు నాలుగు రంగులు వేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు జారీ చేసిన జీవో నెంబర్ 623 రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. గ్రామ వార్డు సచివాలయాలకు వైసీపీ జెండా ని పోలిన మూడు రంగులు వేశారంటూ, వాటిని తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ల పై విచారణ చేసిన రాష్ట్ర హైకోర్టు ఆయా రంగులను తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ […]
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ కార్యాలయాలకు అధికార వైసిపి జెండాను పోలి ఉన్న రంగుల పై హైకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ రంగులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో రంగులను తొలగించేందుకు మూడు వారాల గడువు కావాలని ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరింది. ఈ నేపథ్యంలో సాధారణ సంస్థల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే లోపు రంగులు తొలగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. వైయస్సార్సీపి ప్రభుత్వం వచ్చిన తర్వాత […]
ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు అక్కడే ఉండాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఎక్కడ వారు అక్కడే ఉంటేనే ఈ వైరస్‌ను నియంత్రించగలమని ఆయన చెప్పారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇలాంటి వ్యాధి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు.కరోనాను క్రమశిక్షణతోనే గెలవగలం. నిర్లక్ష్యంతో ఉంటే మూల్యం చెల్లిస్తామనేది ఇతర దేశాలను చూస్తే తెలుస్తోంది. కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. తెలంగాణ నుంచి మన వాళ్లు మన […]
సంక్షేమ పథకాల అమలు, గ్రామ పరిపాలన కోసం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలను అంతకు మించి ఉపయోగించుకునేందుకు సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. విద్య, వైద్యం, రెవెన్యూ, విద్యుత్, వ్యవసాయ సంబంధిత సేవలే కాకుండా భవిష్యత్‌లో భూముల రిజిస్ట్రేషన్లు కూడా గ్రామ సచివాలయాల్లో చేసే ఆలోచన ఉన్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. తనను కలసిన కెనడా ప్రతినిధి బృందంతో ఈ మేరకు జగన్ గ్రామ సచివాలయాల వ్యవస్థ గురించి వివరిస్తూ.. రిజిస్ట్రేషన్ ఆలోచనను వ్యక్తం చేశారు. […]
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్ పదవుల మధ్య పోటీ నెలకొంది. ఈ పోటీలో ఎంపీటీసీ పదవి వెనకబడిపోతోంది. సర్పంచ్ పదవి దూసుకెళుతోంది. అభ్యర్థులు సర్పంచ్ పదవిపైనే మోజు పెంచుకున్నారు. పలు చోట్ల ఎంపీటీసీ పదవికి పోటీ చేసే వారు కరువయ్యారు. ఈ రోజు బుధవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజు కావడంతో.. ఎలాగోలా నామినేషన్లు వేయించేందుకు నేతలు ఉరుకులు పరుగులుపెడుతున్నారు. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఈ పరిస్థితి ఉందంటే సర్పంచ్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులపై హై కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. గ్రామ సచివాలయ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశించింది. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలకు పది రోజుల్లో మళ్లీ రంగులు వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తమ ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలను నివేదిక రూపంలో సమర్పించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ […]
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఈ రోజు సోమవారం నుంచీ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. బుధవారం వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత పురపాలక ఎన్నికలు, చివరగా సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29వ తేదీలోపు ఈ ఎన్నికలు పూర్తి చేసేందుకు అవసరమైన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ ప్రకటించారు. గ్రామ,వార్డు సచివాలయం ఏర్పాటు, ఎన్నికల్లో ధన, మద్యం ప్రభావం లేకుండా చూడడం… వంటి చర్యలతో […]
ఒక మహిళకు ఆర్థిక స్వేచ్ఛనిస్తే పిల్లలను చక్కగా చదివించుకోగలదు. కుటుంబాన్ని నిలబెట్టగలదు. అందుకే జగనన్న అమ్మ ఒడి ద్వారా 15వేల రూపాయలు, వసతి దీవెన ద్వారా 10 వేల నుంచి 20 వేల రూపాయలను వారి అకౌంట్లోనే వేస్తున్నారు. డ్వాక్రా మహిళల అప్పులను నాలుగు దశల్లో జగనే తీర్చబోతున్నారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ. 75 వేలు సాయం అందించే పథకం త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇవన్నీ మహిళల ఆర్థిక […]
ఏ రంగం, ఏ విభాగంలోనైనా జవాబుదారీతనం ముఖ్యం. కానీ మన రాజకీయ, అధికార వ్యవస్థలో అదే లోపించింది. ఒక పని కోసం అధికారుల దగ్గరికి వెళ్తే అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు.. ఎప్పుడు పూర్తి చేస్తారో ఏ అధికారీ చెప్పరు. తిరిగి తిరిగి మనమే అలసిపోవాల్సిందే. కాలక్రమంలో జవాబుదారీతనం అనే మాటే తన మనుగడను కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది. ఇలాంటి పరిస్థితి నుంచి సమూల మార్పులు తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యోచిస్తున్నారు. ప్రతి విషయంలోనూ అకౌంటబులిటీని […]
మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం హైకోర్టును అక్కడకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్రానికి విన్నవించింది. ఇక విశాఖను కార్యనిర్వాహఖ రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడ సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు ఏర్పాటుకు అనువైన భవనాలు, నిర్మాణానికి భూముల అన్వేషణ కొనసాగిస్తోంది. సచివాలయాన్ని మధురవాడలోని మిలీనియం టవర్స్‌లో ఏర్పాటు చేయాలని తొలుత భావించినా.. అక్కడ ఐటీ కంపెనీలు ఉండడంతో ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు […]