iDreamPost
android-app
ios-app

అంత చేసినా.. జగన్‌ సర్కార్‌పై విశ్వాసం ఏ మాత్రం సడలలేదే..!!

అంత చేసినా.. జగన్‌ సర్కార్‌పై విశ్వాసం ఏ మాత్రం సడలలేదే..!!

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలకే దాదాపు లక్ష 30 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తూ దేశ చరిత్రలోనూ విప్లవాత్మక చర్యలు చేపట్టింది. పరిపాలనను ప్రజల చెంతకు తీసుకెళుతూ.. మరో పక్క చర్రితలో ఏ ప్రభుత్వం, ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఒకే సారి భర్తీ చేయలేనన్న ప్రభుత్వ ఉద్యోగాలను జగన్‌ సర్కార్‌ భర్తీ చేసింది. అయితే ఈ భర్తీలో అవకతవకలు జరిగాయంటూ.. పేపర్‌ లీక్‌ అయిందంటూ.. వైఎస్సార్‌సీపీ వారికే ఉద్యోగాలు వచ్చాయంటూ.. ఇలా అనేక రకాలుగా ప్రతిపక్ష టీడీపీ ప్రచారం చేసింది.

గత ఏడాది దాదాపు 1.30 లక్షల గ్రామ, వార్డు సచివాలయంలోని 16 రకాల ఉద్యోగాలకు దాదాపు 22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 20 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. పకడ్బంధీగా పరీక్షలు నిర్వహించిన అధికారులు రోజుల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేశారు. జగన్‌ సర్కార్‌ లక్ష 30 వేల ఉద్యోగాలు కల్పింస్తుందన్న విషయం మరుగునపడేసేందుకు టీడీపీ దృష్ప్రచారం మొదలు పెట్టింది. అయితే ఈ ప్రచారాన్నంతటినీ తిప్పికొడుతూ తాజాగా గత నెలలో జారీ చేసిన నోటిఫికేషన్‌కు లక్షలాది దర ఖాస్తులు వెల్లువెత్తాయి.

గత నెలలో గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగిలిపోయిన 14,061 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతేడాది టీడీపీ, దాని అనుకూల మీడియా అంత దృష్ప్రచారం చేసినా కూడా ఈ పోస్టులకు 11.06 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది 1.30 లక్షల పోస్టులకు 23 లక్షల దరఖాస్తులు రాగా ఈ సారి 14 వేల పోస్టులకే 11 లక్షల దరఖాస్తులు రావడం వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై యువత, నిరుద్యోగులకు ఉన్న విశ్వాశానికి ప్రతీకగా నిలిచింది. కేవలం 14 వేల పోస్టులకే 11 లక్షల దరఖాస్తులు రావడంతో అధికారులు కూడా విస్మయానికి గురువుతున్నారు. రెండు లేదా మూడు లక్షల దరఖాస్తులు వస్తాయని వారు అంచనా వేయగా అంతకు మించి రావడం గమనార్హం.