iDreamPost
android-app
ios-app

పంచాయతీ కార్యాలయాల రంగుల పై హైకోర్టు కీలక ఆదేశాలు

పంచాయతీ కార్యాలయాల రంగుల పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ కార్యాలయాలకు అధికార వైసిపి జెండాను పోలి ఉన్న రంగుల పై హైకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ రంగులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో రంగులను తొలగించేందుకు మూడు వారాల గడువు కావాలని ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరింది. ఈ నేపథ్యంలో సాధారణ సంస్థల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే లోపు రంగులు తొలగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

వైయస్సార్సీపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విప్లవాత్మక చర్యలను చేపట్టింది. గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేసింది. ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు చేర్చేలా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. ఆయా సచివాలయాల్లో 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగులను నియమించింది. 500 పైచిలుకు ప్రభుత్వ సేవలను గ్రామ, వార్డు సచివాలయ ద్వారా ప్రజలకు అందిస్తోంది. పంచాయతీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలు గా మార్చింది. అవసరమైన చోట కొత్త భవనాలను నిర్మిస్తోంది. ఆయా భవనాలకు మూడు రంగులతో కూడిన పెయింటింగ్ లు వేశారు. ఈ రంగులు వైసీపీ జెండా ని పోలి ఉన్నాయని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. కొద్ది రోజులుగా ఈ వ్యవహారం న్యాయస్థానాల్లో నలుగుతోంది.