Swetha
డార్లింగ్ సినిమా రిలీజ్ అంటే ఇక అభిమానులు గాల్లో తేలుతూ ఉంటారు. అసలు అది ప్రభాస్ ఫుల్ లెంగ్త్ రోల్ ఆ.. గెస్ట్ రోల్ ఆ అనేదేమి చూడరు. తెరమీద డార్లింగ్ కనిపించాడంటే ఇక ఆ సినిమాను హిట్ చేసి తీరతారంతే. డార్లింగ్ అంటే అందరికి గుర్తొచ్చేది కూల్ లవర్ బాయ్ లుక్ ఏ. కానీ ఇప్పుడు డార్లింగ్ పూర్తిగా మారిపోయాడు. గత మూడేళ్ళలో మూడు అవతారలలో దర్శనం ఇచ్చాడు.
డార్లింగ్ సినిమా రిలీజ్ అంటే ఇక అభిమానులు గాల్లో తేలుతూ ఉంటారు. అసలు అది ప్రభాస్ ఫుల్ లెంగ్త్ రోల్ ఆ.. గెస్ట్ రోల్ ఆ అనేదేమి చూడరు. తెరమీద డార్లింగ్ కనిపించాడంటే ఇక ఆ సినిమాను హిట్ చేసి తీరతారంతే. డార్లింగ్ అంటే అందరికి గుర్తొచ్చేది కూల్ లవర్ బాయ్ లుక్ ఏ. కానీ ఇప్పుడు డార్లింగ్ పూర్తిగా మారిపోయాడు. గత మూడేళ్ళలో మూడు అవతారలలో దర్శనం ఇచ్చాడు.
Swetha
డార్లింగ్ సినిమా రిలీజ్ అంటే ఇక అభిమానులు గాల్లో తేలుతూ ఉంటారు. అసలు అది ప్రభాస్ ఫుల్ లెంగ్త్ రోల్ ఆ.. గెస్ట్ రోల్ ఆ అనేదేమి చూడరు. తెరమీద డార్లింగ్ కనిపించాడంటే ఇక ఆ సినిమాను హిట్ చేసి తీరతారంతే. డార్లింగ్ అంటే అందరికి గుర్తొచ్చేది కూల్ లవర్ బాయ్ లుక్ ఏ. కానీ ఇప్పుడు డార్లింగ్ పూర్తిగా మారిపోయాడు. గత మూడేళ్ళలో మూడు అవతారలలో దర్శనం ఇచ్చాడు. రాముడిగా , కర్ణుడిగా నేడు రుద్రుడిగా కనిపించి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసేస్తున్నాడు ప్రభాస్.
బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో కొన్ని ఫెయిల్యూర్స్ చూసిన మాట వాస్తవమే. కానీ సలార్ తో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఆ తర్వాత గత ఏడాది జూన్ 27న వచ్చిన కల్కి మూవీతో డార్లింగ్ బాక్స్ ఆఫీస్ బాస్ అనిపించుకున్నాడు. ఆ సినిమాలో కర్ణడిగా దర్శనం ఇచ్చాడు ప్రభాస్. ఇక ఇప్పుడు సరిగ్గా సంవత్సరం తర్వాత అదే జూన్ 27 కన్నప్పలో న రుద్ర గా మరో అవతారంలో దర్శనం ఇచ్చాడు డార్లింగ్. దీనితో సోషల్ మీడియా షేక్ అయింది. ఇది విష్ణు కన్నప్ప సినిమా నే అయినా ప్రభాస్ రుద్ర గురించే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. రెబెల్ గాడ్ అంటూ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. నువ్వు నిజంగానే దేవుడివి సామి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ కు ఇవి లార్జర్ థెన్ లైఫ్ క్యారెక్టర్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం కన్నప్ప మూవీ అయితే థియేటర్స్ లో మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీలో ప్రభాస్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ గా నిలిచిందని విపరీతమైన బజ్ వినిపిస్తుంది. కాస్త క్యామియోకె ఇలా అయిపోతుంటే. నెక్స్ట్ డార్లింగ్ నుంచి వచ్చే లైన్ అప్స్ కి ఇంకా అభిమానుల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. డిసెంబర్ లో రాజాసాబ్ రానుందని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇక ఆ తర్వాత కల్కి 2 , సలార్ 2 , ప్హౌజి సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.