Swetha
సిద్దార్ధ్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీసినా కానీ అందరికి బాగా రిజిస్టర్ అయింది మాత్రం బొమ్మరిల్లు సినిమానే. అతనికి లవర్ బాయ్ ఇమేజ్ చాలా మేలు చేసింది. కానీ అతని ఆ తర్వాత ఎన్ని సినిమాలు తీసినా కానీ అవి ఫెయిల్ అవుతూ ఉండేవి. కేవలం అతని నుంచి వచ్చే లవ్ స్టోరీస్ కి మాత్రమే ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు.
సిద్దార్ధ్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీసినా కానీ అందరికి బాగా రిజిస్టర్ అయింది మాత్రం బొమ్మరిల్లు సినిమానే. అతనికి లవర్ బాయ్ ఇమేజ్ చాలా మేలు చేసింది. కానీ అతని ఆ తర్వాత ఎన్ని సినిమాలు తీసినా కానీ అవి ఫెయిల్ అవుతూ ఉండేవి. కేవలం అతని నుంచి వచ్చే లవ్ స్టోరీస్ కి మాత్రమే ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు.
Swetha
సిద్దార్ధ్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీసినా కానీ అందరికి బాగా రిజిస్టర్ అయింది మాత్రం బొమ్మరిల్లు సినిమానే. అతనికి లవర్ బాయ్ ఇమేజ్ చాలా మేలు చేసింది. కానీ అతని ఆ తర్వాత ఎన్ని సినిమాలు తీసినా కానీ అవి ఫెయిల్ అవుతూ ఉండేవి. కేవలం అతని నుంచి వచ్చే లవ్ స్టోరీస్ కి మాత్రమే ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. సిద్దార్ధ్ మాత్రం ఎప్పటికప్పుడు దాని నుంచి బయటకు వచ్చి కొత్త క్యారెక్టర్స్ ట్రై చేయాలనే చూస్తున్నాడు. ఈ క్రమంలోనే సిద్దార్ద్ నుంచి 40 వ సినిమా ‘3BHK’ రానుంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కచ్చితంగా కనెక్ట్ అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సొంతిల్లు అనేది చాలా మంది కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత ప్రయత్నం చేయాలో దానికి రెండింతలు ఎక్కువగానే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే కాథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. సొంతిల్లు కోసం జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కున్న తండ్రి ఆ బాధ్యతను కొడుకు భుజాల మీద పెడతాడు. కెరీర్ లో ఇంకా సెట్ అవ్వని ఆ కొడుకు ఆ బాధ్యతను ఎలా పూర్తి చేసాడు. ఆ తండ్రి కల ఆ కుటుంబం కల నెరవేరిందా లేదా అనేదే ఈ సినిమా కథ.
ట్రైలర్ చూస్తే చాలా న్యాచురల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు రిలేట్ అయ్యే కథను రాసుకున్నాడు దర్శకుడు. ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్ వచ్చి చాలా రోజులు అయింది. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక డీసెంట్ హిట్ అందుకుంటుందనే నమ్మకం అయితే అందరికి వచ్చింది . సో ఈ ఫ్యామిలీ వాచ్ గ్యాప్ ను 3BHK ఎంతవరకు ఫుల్ ఫిల్ చేస్తుందో చూడాలి. జూలై 4 న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇక ఈసారైనా సిద్దార్ద్ కల నెరవేరితే అదే చాలని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.