iDreamPost
android-app
ios-app

ముఖ్యమంత్రి తో ప్రపంచబ్యాంక్ ప్రతినిధుల భేటీ

ముఖ్యమంత్రి తో ప్రపంచబ్యాంక్ ప్రతినిధుల భేటీ

మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో వరల్డ్‌ బ్యాంక్‌ దక్షిణాసియా మానవ వనరుల అభివృద్ధి విభాగం రీజనల్‌ డైరెక్టర్‌ షెర్‌బర్న్‌ బెంజ్ తో పాటు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని తో పాటు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్‌ నిధులతో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ప్రపంచ బ్యాంక్ అధికారులతో చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రపంచ బ్యాంక్ అధికారులకి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమని వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు కొనియాడారు. మానవ వనరులపై పెట్టుబడి ద్వారా అభివృద్ది ఫలితాలు వస్తాయని ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధుల బృందం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రపంచబ్యాంక్ చేయూతనిస్తుందని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom