సౌత్ ఇండియన్ మెగాస్టార్స్ సూపర్ స్టార్స్ గా కోట్లాది ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న చిరంజీవి రజినీకాంత్ మల్టీ స్టారర్ కాంబినేషన్ ఇప్పుడంటే అంచనాల బరువు, కథల కరువులో ఊహించలేం కానీ 80 దశకంలో ఇది రెండుసార్లు సాధ్యమయ్యింది. అందులో మొదటిది కాళి. ఆ విశేషాలు చూద్దాం. 1980 సంవత్సరం. చిరు కెరీర్ అప్పటికి ఊపందుకోలేదు. మంచి వేషాలు వస్తున్నాయి కానీ సోలో హీరోగా నిలదొక్కుకునేందుకు బాగా కష్టపడుతున్న సమయం. కమల్ హాసన్ తో ‘గురు’ లాంటి […]
థియేటర్లలో పరిస్థితులు మెల్లగా కుదుటపడుతున్నాయి. రేపో ఎల్లుండో ఏపిలో వంద శాతం ఆక్యుపెన్సీ, సెకండ్ షోల అనుమతులు రాబోతున్నాయని తెలిసింది. సెకండ్ లాక్ డౌన్ ఎత్తేసి రెండున్నర నెలలు దాటుతున్నా ఇప్పటిదాకా భారీ చిత్రమేది రాలేదు. లవ్ స్టోరీ వసూళ్లు గట్టిగా వచ్చాయి కానీ అది మీడియం రేంజ్ కిందికే వస్తుంది. సీటిమార్ సైతం అదే క్యాటగిరీలో వేయాల్సిందే. అందుకే మొదటి రోజు హౌస్ ఫుల్ బోర్డులతో కిక్కిరిసిపోయే రద్దీ తెచ్చే హీరో కోసం ట్రేడ్ ఎదురు […]
మహానటి తర్వాత సబ్జెక్టు సెలక్షన్లలో చేసిన పొరపాట్ల వల్ల మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ దక్కలేదు కానీ కీర్తి సురేష్ ఫాలోయింగ్ కి మాత్రం ఎలాంటి లోటు లేదు. ఆఫర్లు కూడా ఆగలేదు. గత ఏడాది పెంగ్విన్, మిస్ ఇండియా రూపంలో రెండు ఓటిటి డిజాస్టర్లు దక్కించుకున్న ఈ భామకు ఈ ఏడాది రంగ్ దే కూడా అంతగా అచ్చిరాలేదు. నితిన్ తో మొదటిసారి కట్టిన జోడి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితేనేం మహేష్ […]
ప్రస్తుతానికి థియేటర్లు తెరుచుకోకపోయినా ఇకపై నిర్మాతలు ఫస్ట్ కాపీలు సిద్ధం చేసుకుని విడుదల సిద్ధం కావడం చాలా అవసరం. ఇప్పుడున్న అనిశ్చితి మహా అయితే ఇంకో నెల రోజులు కొనసాగుతుంది. ఆ తర్వాత సమస్య ఉండకపోవచ్చు. థర్డ్ వేవ్ ఉండకూడదనే ప్రతి ఒక్కరి కోరిక. అది రాకపోతే ఎప్పటిలాగే థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చు. మునుపటిలా కలెక్షన్లు హౌస్ ఫుల్ బోర్డులు చూడొచ్చు. ఎప్పటి నుంచి అనే ప్రశ్నను పక్కనపెడితే స్టార్ హీరోల ప్రొడ్యూసర్లు ఇప్పుడు […]
ఓట్ల కోసం రాజకీయ నాయకులు పడే పాట్లు మామూలుగా ఉండవు. నానా ఫీట్లు చేస్తుంటారు. ఓటర్ల ఇండ్లలో పనులు చేస్తూ ఫొటోలకు పోజులిస్తుంటారు. ఇక తమిళనాడులో ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. చోటామోటా నాయకులే కాదు.. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకోసం రంగంలోకి దిగింది. రజనీపై రాజకీయం కలిసొస్తుందా? తమిళనాడులోనే కాదు.. దేశ విదేశాల్లోనూ క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్. తాను పార్టీ […]
రాజకీయాల్లోకి రావడం లేదని ప్రముఖ నటుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించేశారు. దక్షిణ భారత్ దేశంలోనూ కాదు ఉత్తర భారత్ దేశంలోనూ రజనీకాంత్ అంటే తెలియని సినీ అభిమానులు ఉండరు. ముఖ్యంగా దక్షిణ భారత సినీ ప్రపంచంలో రజనీకాంత్ ఒక సంచలనం. అబ్బురపరిచే ఆయన సై్టల్‌ను ఆరేళ్ల బాలుడు నుంచి ఆరవై ఏళ్ల వృద్ధుల వరకూ పాటించేందుకు ఆసక్తి చూపేవారు. ఇంతటి ప్రజాదారణ ఉన్న సినీ నటుడు.. రాజకీయాల్లోకి వస్తే సంచలనాలేనన్న విశ్లేషణలు సాగాయి. వస్తున్నా.. […]
రాజకీయాల్లోకి వస్తున్నానని ఇటీవల ప్రకటించిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్.. వెనక్కి తగ్గారు. 31వ తేదీన పార్టీ పేరు, ఇతర వివరాలు ప్రకటిస్తానని రజనీకాంత్ తెలపడంతో.. ఆయన అభిమాలు, దేశ వ్యాప్తంగా రాజకీయ ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో తాను రాజకీయాల్లోకి రావడంలేదని, పూర్తిగా తప్పుకుంటున్నానని ప్రకటించిన రజనీకాంత్.. ఆయన అభిమానుల్లో తీవ్ర నిరుత్సాహాన్ని నింపారు. దేవుడు ఆదేశించాడని, అందుకే రాజకీయాల్లోకి రావడంలేదంటూ రజనీ పేర్కొన్నారు. తన నిర్ణయం వెనుక కారణాలను వెల్లడిస్తూ, అభిమానులకు క్షమాపణ చెబుతూ […]
తమిళనాట కొత్త రాజకీయాల గాలివీస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఆరంగేట్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విశేష ప్రేక్షకాధరణ గల నటుడిగా రజనీకాంత్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి నటుడు ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేస్తుండడంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. నెలాఖరులో పార్టీ వివరాలు వెల్లడించనున్న సూపర్ స్టార్ జనవరిలో పార్టీని ప్రారంభించనున్నారు. ఇప్పటికే పార్టీ జెండా, ఎన్నికల గుర్తు విషయంలో క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీతో కలిసి […]
సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టడంపై సందిగ్గత తొలగినప్పటి నుంచీ తమిళనాడు రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. రజనీ పార్టీ వల్ల తమ పార్టీకి లాభనష్టాలను బేరీజు వేసుకోవడంలో ప్రధాన పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. ఇదిలా ఉండగా.. రజనీకాంత్ పార్టీని ప్రారంభించక ముందే అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ నెలాఖరులోగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద […]