iDreamPost
android-app
ios-app

పేదల కోసం ఆసుపత్రి నిర్మించనున్న సూపర్ స్టార్ రజినీకాంత్

  • Published Mar 04, 2024 | 11:51 AM Updated Updated Mar 04, 2024 | 11:51 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి తెలియని వారుండరు ఇండియాలో. సీనియర్ హీరో అయినా.. రోబో సినిమాతో చిన్నారులను కూడా అలరించాడు ఈ నటుడు. ఇప్పుడు ఆయన తన అభిమానుల కోసం

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి తెలియని వారుండరు ఇండియాలో. సీనియర్ హీరో అయినా.. రోబో సినిమాతో చిన్నారులను కూడా అలరించాడు ఈ నటుడు. ఇప్పుడు ఆయన తన అభిమానుల కోసం

  • Published Mar 04, 2024 | 11:51 AMUpdated Mar 04, 2024 | 11:51 AM
పేదల కోసం ఆసుపత్రి నిర్మించనున్న సూపర్ స్టార్ రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కర్ణాటకలో పుట్టి.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తలైవా అయ్యారు. కండక్టర్ ఉద్యోగం నుండి నటుడిగా మారి.. హీరో పాత్రలు పోషించి తమిళ తంబీలకు సినీ దేవుడయ్యాడు. కేవలం కోలీవుడ్‌కే పరిమితం కాలేదు. దక్షిణాది అన్ని భాషలతో పాటు.. హిందీ పరిశ్రమలో అడుగుపెట్టి.. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ఈ సూపర్ స్టార్. ఇండియాలోనే కాదూ.. ప్రపంచ వ్యాప్తంగా అశేషమైన ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండటం ఆయన నైజం. సుమారు 170 చిత్రాల్లో నటించిన ఈ కన్నడిగ.. ఆయన నటన, మ్యానరిజం, స్టైలిష్ యాక్టింగ్‌లతో మెస్మరైజ్ చేస్తుంటారు. ఒక దశలో సినిమాలు వరుస ప్లాపులైన.. ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. మళ్లీ సక్సెస్ బాట పట్టి.. కలెక్షన్లు అంటే ఇవని నిరూపిస్తుంచారు.

రజినీ కాంత్ రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టారే. చాలా మందికి గుప్త దానాలు చేస్తూ ఉంటారు. ఇది ఇండస్ట్రీలో ఎప్పటి నుండో తెలిసిన వారు చెబుతున్న మాటలివే. తమిళనాడుకు వరదలు వచ్చిన సమయంలో ఆపన్నహస్తం అందించారు. అలాగే కరోనా సమంలో రోడ్డున పడ్డ సినీ కార్మికుల సహాయార్ధం ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘానికి రూ. 50 లక్షలు అందజేశారు. తెలిసినవే కాకుండా తెలియని దానాలు ఎన్నో చేశారు ఆయన. ఎప్పుడు ప్రజలే దేవుళ్లుగా భావించే ఈ సూపర్ స్టార్.. ఇప్పుడు వారి కోసమే ఓ ఆసుపత్రి కట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. చెన్నై ఓఎంఆర్ రోడ్డు నుండి తలంబూరు వెళ్లే మార్గంలో 12 ఎకరాల భూమిని  కొనుగోలు చేశారు రజనీకాంత్. అక్కడ ఆసుపత్రిని నిర్మించాలని యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చెంగల్ పట్టులోని తిరుప్పొరూర్ లోని రిజిస్టార్ కార్యాలయాన్ని సందర్శించారు. కొత్తగా కొనుగోలు చేసిన భూమిని రిజిస్టర్ చేయించేందుకు వచ్చారాయన.

రజినీకాంత్ అక్కడకు వస్తున్నారని సమాచారం లీక్ కాగానే.. వేలాది మంది అభిమానులు అక్కడకు చేరుకున్నారు. పేదలు న్యాణమైన ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఆ ప్రాంతంలో భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలనుకుంటున్నారట ఈ సూపర్ స్టార్. ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని సమాచారం. ఆ హాస్పిటల్ నిర్మాణ పనుల బాధ్యతల్ని తన స్నేహితుడికి అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తన 170 చిత్రంలో బిజీగా ఉన్నారు. జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ దర్వకత్వంలో వెట్టయాన్ అనే మూవీ తెరకెక్కుతుంది. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, పహాద్ ఫజిల్, రానా, మంజువారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ వంటి స్టార్స్ యాక్ట్ చేస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş