Nidhan
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఇమిటేడ్ చేశారు. తలైవా స్టైల్‌ను పీఎం దింపేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఇమిటేడ్ చేశారు. తలైవా స్టైల్‌ను పీఎం దింపేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
Nidhan
లోక్‌సభ ఎన్నికలు-2024కు సమయం దగ్గర పడుతోంది. దీంతో దేశంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఉన్న తక్కువ సమయాన్ని మరింత బాగా వాడుకోవాలని పార్టీలు, నేతలు భావిస్తున్నారు. అన్ని పార్టీలు ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఫుల్ బిజీబిజీగా ఉన్నాయి. ఎలాగైనా నెగ్గాలని కంకణం కట్టుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రచార పనుల్లో తలమునకలై ఉన్నారు. బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన విశేషంగా కృషి చేస్తున్నారు. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అనే తేడాల్లేకుండా దేశం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల గెలుపునకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల మనసులు దోచేందుకు ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రచార సభలో తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను ఇమిటేట్ చేశారు.
తలైవా రజినీకాంత్‌ను ప్రధాని మోడీ ఇమిటేడ్ చేశారు. తమిళ సూపర్‌స్టార్ స్టైల్‌ను పీఎం దింపేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. కర్ణాటకలో బీజేపీ నిర్వహించిన ఓ ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. మోడీని కలిసేందుకు రాష్ట్ర ప్రముఖ నేతలు ఎగబడ్డారు. కొందరు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే ఓ నాయకుడు మోడీ మెడలో భారీ కండువా కప్పారు. అయితే అది జారిపోతుండటంతో ఆ నేత దాన్ని అడ్జస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని గమనించిన మోడీ దాన్ని స్టైలిష్‌గా తిప్పారు.
రజినీకాంత్ తరహాలో కండువాను స్టైలిష్‌గా ముందు సైడ్ తిప్పి వేసుకున్నారు మోడీ. ఆ తర్వాత ఓకే కదా అంటూ నవ్వుతూ ఆ నాయకుడికి సైగలు చేశారు. దీంతో సదరు నేత నవ్వుల్లో మునిగిపోయారు. ఓకే సార్, సూపర్ సార్ అంటూ మోడీకి ఆయన చేతులు జోడించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. తలైవాను మోడీ దింపేశారని కామెంట్స్ చేస్తున్నారు. రజినీలాగే స్టైలిష్‌గా తిప్పడం, ఓకేనా అంటూ సైగ చేయడం అదిరిపోయిందని అంటున్నారు. పరిపాలన, వాక్చాతుర్యంలోనే కాదు.. స్టైల్లోనూ మోడీ సూపర్బ్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మరి.. తలైవాను మోడీ ఇమిటేట్ చేయడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
The swag video of PM Narendra Modi doing a Rajinikant style shawl flip followed by Rajini’s signature gesture during the election campaign goes viral pic.twitter.com/NH9Xmosi8R
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 6, 2024