iDreamPost
android-app
ios-app

రజినీకాంత్ 171 టైటిల్ టీజర్ రిలీజ్.. బాషా రేంజ్ ఎలివేషన్స్ తో..

  • Published Apr 22, 2024 | 6:36 PM Updated Updated Apr 22, 2024 | 8:21 PM

Thalaivar 171 Title Teaser: రజినీకాంత్ వరుస ప్రాజెక్టులతో అభిమానులను అలరించేందుకు రెడీ అయిపోయారు. అందులో భాగంగా 171 టైటిల్ టీజర్ ని రివీల్ చేశారు. మరి.. ఆ టీజర్ ఎలా ఉందో చూడండి.

Thalaivar 171 Title Teaser: రజినీకాంత్ వరుస ప్రాజెక్టులతో అభిమానులను అలరించేందుకు రెడీ అయిపోయారు. అందులో భాగంగా 171 టైటిల్ టీజర్ ని రివీల్ చేశారు. మరి.. ఆ టీజర్ ఎలా ఉందో చూడండి.

  • Published Apr 22, 2024 | 6:36 PMUpdated Apr 22, 2024 | 8:21 PM
రజినీకాంత్ 171 టైటిల్ టీజర్ రిలీజ్.. బాషా రేంజ్ ఎలివేషన్స్ తో..

సూపర్ స్టార్ రజినీకాంత్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జైలర్ తో అదిరిపోయే హిట్టు కొట్టారు. బాక్సాఫీస్ కి ఇప్పటికీ తానే రారాజు అంటూ నిరూపించారు. అలాగే ఇప్పుడు తలైవర్ 171తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ఎలాంటి టైటిల్ పెడతారు? ఎలాంటి కథతో వస్తున్నారు? లోకేశ్ కనకరాజు మూవీ అంటే ఏ రేంజ్ లో ఉంటుంది? అనిరుధ్ ఈసారి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడు? ఇలాంటి చాలానే ప్రశ్నలు వినిపించాయి. వాటి అన్నింటికి మేకర్స్ ఒకే ఒక్క టైటిల్ టీజర్ తో సమాధానం చెప్పేశారు.

తలైవర్ 171 మూవీ టైటిల్ కూలీగా ఫిక్స్ చేశారు. ఆ విషయాన్ని ఒక టైటిల్ టీజర్ తో అధికారికంగా ప్రకటించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే జైలర్ తో బిగ్గెస్ట్ హిట్టు కొట్టిన ఆయన మరోసారి రజినీకాంత్ తో కాంబో రిపీట్ చేస్తున్నారు. ఈమూవీని లోకేష్ కకరాజుతో చేస్తున్నారు. టైటిల్ తోనే కాదు.. టీజర్ తో కూడా ఆడియన్స్ కి, ఫ్యాన్స్ ఫుల్ ట్రీట్ ఇచ్చేశారు. ఇది కేవలం టైటిల్ టీజర్ మాత్రమే కాదు.. ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ తో దాదాపుగా కథ గురించి కూడా చెప్పేశారు. ఈ టీజర్ చూస్తున్నంతసేపు రజినీకాంత్ మీకు బాషా సినిమాల సమయంలో చూసిన స్వాగ్, లుక్స్ గుర్తొస్తాయి.

లోకేశ్ కనకరాజు అంటే కచ్చితంగా స్మగ్లింగ్, ఇల్లీగల్ దందాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ మూవీ మొత్తం బంగారం చుట్టూ తిరిగేలా కనిపిస్తోంది. ఒక పెద్ద ముఠా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటుంది. వందల కిలోల బంగారం ఉన్న స్థావారానికి రజినీకాంత్ వస్తాడు. అక్కడకు వెళ్లి అందిరనీ తనదైన స్టైల్ లో ఇరగొట్టేస్తాడు. అనిరుధ్ మ్యూజిక్ కూడా అదరగొట్టాడు. ఈ గ్యాప్ లో అదిరిపోయే డైలాగ్స్ కూడా ఉన్నాయి. దారి మంచిదైనా.. చెడ్డదైనా నువ్వు నమ్మిన దారిలో పోతూ ఉండూ అనే స్టైల్ లో రజినీకాంత్ చెప్పిన డైలాగ్ కి థియేటర్లలో అయితే విజిల్స్ మోగిపోతాయి. మొత్తానికి ఈ మూవీతో లోకేశ్ కనకరాజు ఒక వింటేజ్ రజినీకాంత్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. అలాగే లోకీ యూనివర్స్ లోకి ఆహ్వానిస్తాడో లోదో చూడాలి. మరి.. కూలీ టీజర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom