ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడి వారంరోజులు గడిచినా దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైంది. పంజాబ్లో అధికారం కోల్పోగా, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలలోనూ అధికారంలోకి రాలేకపోయింది. ఇక ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. 403 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యత […]
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై బిజెపి సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ కీలకంగా వ్యవహరిస్తుంది. యుపి కేంద్రంగా ఆమె రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. వలస కార్మికులను తరలించేందుకు కాంగ్రెస్ తరపున వెయ్యి బస్సులను సమకూర్చిన ప్రియాంక గాంధీ, అనేక అంశాలపై వెనువెంటనే స్పందిస్తున్నారు. వివిధ సందర్భాల్లో ప్రియాంక గాంధీ కార్యక్రమాలను కూడా యుపి ప్రభుత్వం అడ్డుకుంటుంది. […]
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారు చిక్కుల్లో పడింది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 18 మంది ఎమ్మెల్యేలు బెంగుళూరు అంగ్సాన రిసార్టులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తిరుగుబాటు చేసిన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. జ్యోతిరాదిత్య సింథియా ఆధ్వర్యంలో ఈ తిరుగుబాటు జరుగుతుంది. కాగా నేడు జ్యోతిరాదిత్య సింథియా అమిత్ షా తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలవడం మధ్య ప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ లో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం వీరి […]