Arjun Suravaram
Priyanka Gandhi In Hospital: కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆమెను ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదే విషయాన్ని ప్రియాంకానే ఎక్స్ వేదికగా స్వయంగా వెల్లడించారు.
Priyanka Gandhi In Hospital: కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆమెను ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదే విషయాన్ని ప్రియాంకానే ఎక్స్ వేదికగా స్వయంగా వెల్లడించారు.
Arjun Suravaram
ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అస్వస్థతకు గురయ్యారు. ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరింది. ఇదే విషయాన్ని ప్రియాంక గాంధీనే స్వయంగా ఎక్స్ వేదిగా వెల్లడించారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఆ అనారోగ్య సమస్యలు ఏమిటి, అసలు ఏం జరిగిందనే విషయాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. ఇక ప్రియాంక అస్వస్థతకు గురైన విషయం తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన గురవుతున్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. ఈనేపథ్యం ఆ యాత్రకు ప్రియాంక గాంధీ స్వాగతం పలకాలని ఉంది. ఈ క్రమంలోనే ఆమె అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరడంతో ఆమె.. రాహుల్ యాత్రకి వెళ్లలేకపోయారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన సోదరుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర.. యూపీ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకాలని భావించింది. అంతేకాక ఆ యాత్రలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసినట్లు ప్రియాంక తెలిపారు.
అయితే అకస్మాత్తుగా ప్రియాంక గాంధీ అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరారు. దీంతో దురదృష్టవశాత్తు రాహుల్ యాత్రలో పాల్గొనడం జరగలేదని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాను కోలుకుని.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటానని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు.
రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రను నిర్వహిస్తున్నారు. యాత్ర ప్రస్తుతం బీహార్ మీదుగా సాగుతోంది. బీహార్‌లోని ఔరంగాబాద్‌లో గురువారం జరిగిన మెగా ర్యాలీలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు. శుక్రవారం లోక్‌సభకు అత్యధిక సంఖ్యలో ఎంపీలను పంపే కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో యాత్ర జరిగింది. ఈయాత్ర నేటి నుంచి 21 వరకు, అలానే ఫిబ్రవరి 24 నుండి 25 వరకు రాష్ట్రంలో ప్రయాణిస్తుంది. ఫిబ్రవరి 22, 23 యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.