ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీ వ్యతిరేక పార్టీలకు నిరాశను కలిగించాయి. ఉత్తరప్రదేశ్‌తోపాటు, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలలో మళ్లీ బీజేపీనే అధికారం వరించబోతోందని దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. పంజాబ్‌లో ఆప్, గోవాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని పేర్కొన్నాయి. పంజాబ్‌లో బీజేపీ బలంగా లేదు. ఆ రాష్ట్రంలపై కమలం పార్టీ ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. ఐదు రాష్ట్రాలలో అతి ముఖ్యమైన ఉత్తరప్రదేశ్‌పైనే బీజేపీ నేతలు ఎక్కువగా ఫోకస్ చేశారు. […]
నూతన సాగు చట్టాలను రద్దు చేయడం, పంటల కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్లతో రైతులు చేస్తున్న ఉద్యమం గణతంత్ర దినోత్సవం తర్వాత మరో దశకు చేరిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఢిల్లీ సరిహద్దుల్లో భైటాయించిన రైతులు శాంతియుతంగా నిరసన తెలపగా.. ఇప్పుడు ప్రత్యక్ష పోరు సాగిస్తున్నారు. వివిధ మార్గాల్లో తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. మహా పంచాయత్‌లు, ఖాఫ్ పంచాయత్‌లు నిర్వహిస్తున్న రైతు సంఘాల నేతలు, భారతీయ కిసాన్ యూనియన్నేత రాకేష్ […]
గత ఏడాది నవంబర్ 26వ తేదీన నూతనసాగు చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు మొదలుపెట్టిన ఉద్యమం కీలక మలుపు తిరిగింది. గత నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలు, ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న పరిణామాల తర్వాత రెండు రోజులు ఉద్యమ తీవ్ర తగ్గినట్లు కనిపించినా.. భారతీయ కిసాన్ యూనియన్ నేత (బీకేయూ) రాకేష్ టికాయత్ రాకతో రైతు ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. మునుపటి కన్నా ఉద్యమ తీవ్రత […]
నూతనంగా తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రెండు నెలలుగా ఎముకలు కొరికే చలిలో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్నారు. వర్షంలో తడిచారు. అర్థాకలితో గడిపారు. వీళ్లు రైతులేనా అంటూ చేసిన అవహేళనలను సహించారు. అవమానాలను దిగమింగారు. రెచ్చగొట్టినా శాంతియుతంగా నిలిచారు. 150 మంది అన్నదాతలు అశువులుబాసారు. కేసులు ఎదుర్కొన్నారు. అరాచక శక్తులు ట్రాక్టర్ ర్యాలీని ఉద్రిక్తతంగా మార్చినా.. అన్నదాతల పట్టుసడలలేదు. అయినా.. కేంద్ర ప్రభుత్వంలో మాత్రం మార్పు కనిపించడం లేదు. అన్నదాతల […]
తాడో పేడో తేల్చుకోమంటారు..పెద్దలు. అంతేకాదు అదే సమయంలో తెగేదాకా లాగొద్దని చెబుతారు ఆ పెద్దలే..అంటే అర్దం సందర్భాను సారం..నిర్ణయం తీసుకోవాలని అర్దం.. అంతేకాని తాడో పేడో తేల్చుకునే సమయం వచ్చింది కాబట్టు తాము పట్టిన కుందేటికి ముూడేకాళ్లు అనడం సరైంది కాదన్నది దాని పరోక్ష హెచ్చరిక..ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. ప్రపంచాన్ని కదిలించిన రైతు పోరాటం సుప్రీం తీర్పుతో చివరి దశకు చేరిందనే చెప్పాలి. రైతు ఉద్యమంపై సుప్రీం కోర్టు స్పందించి తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు కేంద్రాన్ని […]
తొలుత రైతు ఆందోళలను పెద్దగా ఖాతరు చేయలేదు. ఆ తర్వాత దాని మీద ఖలీస్తాన్ మద్ధతుదారులనే ముద్ర వేయాలని చూశారు. అయినా చల్లారకపోవడంతో దానిని కేవలం పంజాబ్ కే పరిమితం అని ప్రచారం చేయాలనుకున్నారు. కానీ తీరా చూస్తే ఉద్యమం పేరుతో ఢిల్లీని ముట్టడించిన రైతులు వెనక్కి తగ్గకపోవడంతో కేంద్రంలో కదలిక తప్పడం లేదు. పంజాబ్ దే ఉద్యమం అని చెప్పినా బీజేపీ పాలిత హర్యానా, ఉత్తరాఖండ్ లో కుతకుతలాడుతున్న రైతన్నల ఆందోళనలు కేంద్రాన్ని సతమతం చేస్తున్నాయి. […]