తమ దగ్గర ఏలియన్స్ శవాలు ఉన్నాయంటూ మెక్సికన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం రెండు వింత శరీరాకృతులను మెక్సికన్ కాంగ్రెస్‌లో ప్రదర్శనకు సైతం ఉంచారు. అవి డయాటమ్ గనుల్లో దొరికాయని, ఎక్కువ కాలం అక్కడ ఉండటం వల్ల అవి శిలాజాలుగా మారాయని ప్రముఖ మెక్సికన్ జర్నలిస్ట్, యూఫాలజిస్ట్ జైమే మోస్సాన్ తెలిపారు. రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా వాటి వయసును అంచనా వేశామని, అవి దాదాపు 1000 ఏళ్ల […]
ఏలియన్స్ ఉన్నాయా? లేవా? అన్నదానిపై చాలా కాలం నుంచి చర్చ జరుగుతోంది. కొంతమంది ఏలియన్స్‌ను చూశామని అంటూ వాటితో తమకు ఎదురైన అనుభవాలను చెప్పుకుని తిరుగుతున్నారు. మరికొంతమంది అసలు ఏలియన్సే లేవని అంటున్నారు. ఈ రెండు వాదనలను పక్కన పెడితే.. మనుషులకు షాక్ ఇచ్చే ఓ సంఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. ఏకంగా మెక్సికన్ కాంగ్రెస్‌లో ఏలియన్ శవాలంటూ రెండు విచిత్రంగా ఉన్న శరీరాలను ప్రదర్శనకు ఉంచారు. అద్దాల పెట్టెల్లో ఉంచిన వాటిని చూస్తున్న జనం షాక్‌కు గురవుతూ […]
అప్పటి వరకు ఆ పార్టీ బంధుమిత్రుల కేకలు, చప్పుట్లతో ఎంతో సంతోషంగా ఉండింది. ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నామన్న సంతోషంలో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పార్టీకి వచ్చిన వారితో నవ్వుతూ, తుళ్లుతూ తిరగసాగారు. ఇలాంటి సమయంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. పార్టీలో మరింత ఊపు తెచ్చేందుకు వచ్చి… ఆకాశంలో చక్కర్లు కొడుతున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. గాల్లో పేలి నేల కొరిగింది. ఈ సంఘటనలో ఓ పైలట్ మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన మెక్సికోలో […]
మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత పరిస్థితి విషమంగా ఉంది. ఈ బస్సులో ఆరుగురు బారతీయులు కూడా ఉన్నారనే వార్త కలకలం రేపుతోంది. తక్షణమే సహాయ చర్యలు చేపట్టడానికి కూడా వీలు కాలేదు. ఎందుకంటే బస్సు 50 మీటర్ల లోయలోకి దూసుకెళ్లింది. గురువారం తెల్లవారుజామున ఎలైట్ ప్యాసెంజర్ లైన్ కి చెందిన ఒక బస్సు మెక్సికో రాజధాని టెపిక్ కు సమీపంలో బర్రాన్కా బ్లాంకా వద్ద […]
సినిమా హీరోలకు, క్రికెటర్లకు, క్రీడాకారులకు ఇలా సెలబ్రిటీలందరికి అభిమానులు ఉంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక సెలబ్రిటీలు అడిగితే.. ఏం చేయడానికైనా వెనకాడరు ఫ్యాన్స్. అలాగే అభిమానుల కోసం ఏదైనా చేయడానికి రడీగా ఉంటారు కొందరు సెలబ్రిటీస్. తాజాగా ఓ లేడీ ఫుట్ బాలర్ అభిమానుల కోసం ఎవరూ చేయని సాహసం చేసింది. ఈ సాహసం గురించి తెలిసి అందరు షాక్ కు గురవుతున్నారు. అభిమానులు డిమాండ్ చేయడంతో అశ్లీల వెబ్ సైట్ లో జాయిన్ అయ్యింది ఈ […]
ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై నిరసన జ్వాలలు చల్లారకముందే మరో ఉదంతం చోటుచేసుకుంది. అయితే ఇది అమెరికాలో కాదు. మెక్సికోలో చోటు చేసుకుంది. మాస్క్ ధరించలేదని ఒక కార్మికుడుని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అంత వరకు పర్వాలేదు. కాని ఆ కార్మికుడు పోలీసు కస్టడీలో మృతి చెందాడు. దీంతో మెక్సికోలో ఆందోళనలు పెరిగాయి. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వార్ మొదలైంది. దీంతో మెక్సికోలో అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మెక్సిలో ఆందోళనకారులు […]
ఎక్కడో చైనా లో కరోనా వైరస్ ప్రబలితే ప్రత్యేకంగా ఇక్కడ మన ఆంధ్ర ప్రదేశ్ లో రైతులకి వచ్చిన ఇబ్బంది ఏమిటనుకుంటున్నారా ?? కానీ ఇది నిజం. ఒకపక్క కరోనా వైరస్ విజృంభణతో చైనా అతలాకుతలం అవడంతో పాటు ఈ ప్రభావం చైనా ఆర్ధిక వ్యవస్థ మీద కూడా చాలా బలంగా పడింది. దీనితో చైనా ఎగుమతులు దిగుమతులపై కూడా ఈ కరోనా వైరస్ ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. గత 15 రోజుల నుండి ఇతర దేశాలతో […]