Idream media
Idream media
ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై నిరసన జ్వాలలు చల్లారకముందే మరో ఉదంతం చోటుచేసుకుంది. అయితే ఇది అమెరికాలో కాదు. మెక్సికోలో చోటు చేసుకుంది. మాస్క్ ధరించలేదని ఒక కార్మికుడుని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అంత వరకు పర్వాలేదు. కాని ఆ కార్మికుడు పోలీసు కస్టడీలో మృతి చెందాడు. దీంతో మెక్సికోలో ఆందోళనలు పెరిగాయి. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వార్ మొదలైంది. దీంతో మెక్సికోలో అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
మెక్సిలో ఆందోళనకారులు ఓ పోలీసుకు నిప్పటించారు. ఈ ఘటన మెక్సికోలోని గాదల్‌రాజారా నగరంలో చోటుచేసుకుంది. ముఖానికి మాస్క్ ధరించలేదన్న కారణంతో 30 ఏళ్ల వయసున్న లోపెజ్ అనే కార్మికుడిని మెంబ్రిలోస్ అనే పట్టణంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పోలీసు కస్టడీలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో గాదల్‌రాజారా నగరంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆగ్రహంతో ఊడిపోయిన నిరసనకారులు ఓ పోలీసు అధికారికి నిప్పంటించేశారు. వెంటనే స్పందించిన అధికారులు మంటలను ఆర్పివేసి అతడిని ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా పలు పోలీసు వాహనాలు సహా పలు భవనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండటంతో 22 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకోగా వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతాన్ని తలపించే ఘటనలు ప్రపంచంలో చాలా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. భారత దేశంలో రాజస్థాన్‌లో కూడా పోలీసులు ఇలానే ఒక వ్యక్తిని చేశారు.