iDreamPost
android-app
ios-app

ఏలియన్స్‌ శవాలకు వైద్య పరీక్షలు.. కడుపులో గుడ్లు!

ఏలియన్స్‌ శవాలకు వైద్య పరీక్షలు.. కడుపులో గుడ్లు!

తమ దగ్గర ఏలియన్స్‌ శవాలు ఉన్నాయంటూ మెక్సికన్‌ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం రెండు వింత శరీరాకృతులను మెక్సికన్‌ కాంగ్రెస్‌లో ప్రదర్శనకు సైతం ఉంచారు. అవి డయాటమ్‌ గనుల్లో దొరికాయని, ఎక్కువ కాలం అక్కడ ఉండటం వల్ల అవి శిలాజాలుగా మారాయని ప్రముఖ మెక్సికన్‌ జర్నలిస్ట్‌, యూఫాలజిస్ట్‌ జైమే మోస్సాన్‌ తెలిపారు. రేడియో కార్బన్‌ డేటింగ్‌ ద్వారా వాటి వయసును అంచనా వేశామని,  అవి దాదాపు 1000 ఏళ్ల పూర్వానివని ఆయన వెల్లడించారు.

పెరులోని కుస్కోనుంచి వాటిని తీసుకువచ్చారని తెలిపారు. డీఎన్‌ఏను పరీక్షించినపుడు.. వాటి డీఎన్‌ఏలో 30 శాతం ఈ ప్రపంచంలోని జీవులతో సంబంధం లేకుండా ఉందని అన్నారు. ఇక, మెక్సికన్‌ కాంగ్రెస్‌లో ప్రదర్శనకు ఉంచిన ఎలియన్‌ శవాలపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ జరగటం మొదలైంది. ఎలియన్స్‌ అసలు లేవని, మెక్సికో తప్పుడు ప్రచారాలు చేస్తోందన్న విమర్శలు కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ మెక్సికో తమ వాదన విషయంలో వెనక్కు తగ్గటం లేదు.

తాజాగా, ఎలియన్స్‌ శవాలపై మెక్సికన్‌ డాక్టర్లు పలు పరీక్షలు చేశారు. జోస్‌ డే జీసస్‌ జాల్సే బెనిటెజ్‌ అనే ఫోరెన్సిక్‌ డాక్టర్‌ ఆధ్వర్యంలో ఈ వైద్య పరీక్షలు జరిగాయి. పరీక్షల అనంతరం వైద్యులు మాట్లాడుతూ.. ‘‘ శవాలు ఏక అస్తిపంజరం కలిగి ఉన్నాయి. తల పెద్దగా ఉంది. వాటి చేతులకు మూడు వేళ్లు మాత్రమే ఉన్నాయి. రెండిటిలో ఓ ఆడ ఎలియన్‌ ఉంది. దాని కడుపులో మూడు గుడ్లు కూడా ఉన్నాయ’’ ని తెలిపారు. మరి, ఈ ప్రపంచంలో ఏలియన్స్‌ నిజంగానే ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.