ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణతో విధించిన లాక్ డౌన్ మూలంగా పారిశ్రామిక రంగం స్తంభించింది. వ్యాపార రంగంలో వస్తువుల ఉత్పత్తి, మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.దీనితో మీడియా సంస్థలకు వచ్చే వ్యాపార ప్రకటనలు ఆగిపోయి ఆదాయం గణనీయంగా పడిపోయింది.ఇప్పటికే చాలా మీడియా సంస్థలు తమ స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ జర్నలిస్టులను తొలగించాయి. ఈ విపత్తు కాలంలో పత్రికను నడపటానికి సరైన ఆదాయ వనరులు లేక తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రభూమి నిలిచి పోయిన సంగతి తెలిసిందే. పలు జాతీయ దినపత్రికలను ప్రచురించే […]
1993 నుండి ప్రతి సంవత్సరం మే 3వ తారీఖున పత్రికా స్వేచ్చ కోసం త్యాగాలు చేసిన జర్నలిస్టులను స్మరించుకుంటు యునిస్కో సభ తీర్మానం మేరకు పత్రికా స్వేచ్చ దినోత్సవం జరుపుకుంటున్నాము. నిజానికి భారత రాజ్యంగంలో పత్రికా స్వేచ్ఛకు సంభందించి ప్రత్యకమైన పదం ఏమీ లేకపోయినా , ఆర్టికల్ 19(1)ఏ ప్రకారం ప్రతి పౌరుడికి ఉండే భావ ప్రకటనా స్వేచలో భాగంగానే పత్రికా స్వేచ్చను పరిగణిస్తున్నారు. కానీ పత్రికా స్వేచ్చకు మన పత్రికలు నిజంగా అర్హమైనవేనా అనే ఆలోచన […]
తెలంగాణా కేసియార్ దెబ్బంటే ఇలాగే ఉంటుంది. చెప్పదలచుకున్న విషయాన్ని, చేయదలచుకున్న పనిని నిర్భయంగా చేసేస్తారనే విషయం మరోసారి రుజువైంది. సోమవారం రాత్రి జరిగిన మీడియా సమావేశంలో అదే విషయం మరోసారి తేలిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ నేపధ్యంలో కొన్ని పత్రికల్లో వ్యతిరేక వార్తలు, కథనాలు వచ్చిన విషయమై కేసియార్ మండిపోయారు. గాంధి ఆసుపత్రిలో రోగులపై జరిగిన దాడి విషయంపై ఓ సెక్షన్ మీడియాలో వార్తలొచ్చాయి. అంటే డాక్టర్లకే రక్షణ లేదంటూ కథనాలు వచ్చాయి. అలాగే […]
తెలుగు రాష్ట్రాల్లో మీడియా డబల్ యాక్షన్ చేస్తోంది. ఒకే మీడియా తెలంగాణా వ్యవహారాల్లో ఒకలాగ, ఏపి విషయంలో మరోలాగ వ్యవహరిస్తోంది. ఏపి విషయంలో తప్పని చెప్పింది అదే విషయాన్ని తెలంగాణాలో ఒప్పని ఒప్పేసుకుంటోంది. అలాగే తెలంగాణాలో కరెక్టుగా అనిపించిది ఏపికి వచ్చేసరికి తప్పులుగా కనబడుతోంది మీడియాకు. పైగా ఏపిలో చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపిస్తు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషయంలో నానా యాగీ చేస్తోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలోనే ఈ విషయం బయటపడింది. తాజాగా […]
జర్నలిజం..ఒకప్పుడు అదో ఫ్యాషన్. సమాజంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ఆ వృత్తిలో అడుగుపెట్టారు. అందుకు అనుగుణంగానే అనేక మందిని ప్రభావితం చేసేవారు. రాతలతో పాలనా రీతులు మార్చేసిన అనేక మంది పాత్రికేయుల చరిత్ర మన దగ్గర ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాత్రికేయం పాలకులకు ఒత్తాసు పలకే పనిలో మునిగింది. అక్షరం ఆయుధమై రగిన చోట ఇప్పుడు అడుగులకు మడుగులొత్తుతోంది. చివరకు అక్షరాన్ని నమ్ముకున్న రాతగాళ్ల తలరాతలను దిగజార్చేలా చేస్తోంది. మీడియా వ్యాపారుల ఉచ్చులో […]
తనకు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వండివారుస్తున్న మీడియాపై సీఎం వైఎస్ జగన్ మెతక వైఖరి కనబరుస్తున్నారు. నిరాధారమైన, అసత్య కథనాలు, వార్తలు ప్రచురించినా/ప్రచారం చేసినా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ తన ప్రమాణ స్వీకారం రోజునే హెచ్చరించారు. అందులో భాగంగా జీవో కూడా జారీ చేశారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున దూమారం రేగినా ఆయన వెనక్కి తగ్గలేదు. జీవోను వెనక్కి తీసుకోలేదు. అయితే జగన్ చెప్పిన ప్రకారం.. జారీ చేసిన జీవో ప్రకారం […]
మహిళాసంఘాలు, ఇతర సమాజం ఈ లాయర్ని ఎందుకు ఉపేక్షిస్తోందో అర్థం కాదు. ఇతని పేరు ఏ.పి సింగ్. నిర్భయ కేసులో ఉన్న దోషుల పక్షాన వాదిస్తున్న లాయర్ మహాశయుడు. పెళ్లికి ముందు తన కూతురు కానీ, చెల్లెలు కానీ సెక్సులో పాల్గొందని తెలిస్తే తన బంధువుల సమక్షంలో పెట్రోల్ పోసి తగలబెడతానని పబ్లిగ్గా చెప్పిన ప్రబుద్ధుడు. అటువంటి వ్యక్తిత్వంతో నిర్భయ రేపిస్టుల ఉరిని ఆపే ప్రయత్నాలు చేస్తున్న నీచుడు. ఇలా ఇంకా ఎంత తిట్టినా సరిపోదు. పాత్రికేయ […]
మీడియా ప్రాధాన్యత ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. కాలం, ఘటన ఆధారంగా దేనికి ఎంత ప్రాముఖ్యం వస్తుందో అంచనా వేయచ్చు. మొదటి పేజీ ఘటన అనుకున్నది మరి కాసేపటికి లోపలి పేజీకి వెళ్లోచ్చు. రెండు రోజులకు అది అస్సలు కనిపించకపోవచ్చు. అంటే.. నిన్న మొన్నటి వరకు జరిగిన సీఏఏ, సీఆర్సీ అంశాలు మాదిరిగా అన్న మాట. ఇలాగే ఢిల్లీ ఎన్నికలు కూడా ఈ గాటినే కట్టేయచ్చు. గత ఎన్నికలప్పుడు తెలుగు ప్రధాన పత్రికల్లో ఢిల్లీ ఎన్నికల గురించి ప్రతి రోజూ […]
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన మీడియాపై ప్రజల్లో విశ్వాసం పోతోంది. ఇప్పుడు వారు వండి వడ్డిస్తున్న వార్తలు, కథలు, కధనాలు ఏకపక్షంగానే ఉన్నాయి. అమరావతి, తెలుగు మీడియం – ఈ రెండు సమస్యలు మినహా వారికి ఇంకేమీ పట్టినట్టు లేవు. అమరావతిలో రైతులు నష్టపోయారు, పోరాటం చేస్తున్నారు. ఇది మొదటి పేజిలో పతాక శీర్షిక. లోపలి పేజీల్లో కొనసాగింపు. ఇక తెలుగు భాష అంతరించి పోతుంది. అమ్మ భాషను కాపాడుకోవాలి. ఇది రెండో వార్త. ఈ వార్తకు […]