iDreamPost
android-app
ios-app

నిర్భయ రేపిస్టు కంటే డెంజర్

  • Published Feb 02, 2020 | 2:45 AM Updated Updated Feb 02, 2020 | 2:45 AM
నిర్భయ రేపిస్టు కంటే డెంజర్

మహిళాసంఘాలు, ఇతర సమాజం ఈ లాయర్ని ఎందుకు ఉపేక్షిస్తోందో అర్థం కాదు. ఇతని పేరు ఏ.పి సింగ్. నిర్భయ కేసులో ఉన్న దోషుల పక్షాన వాదిస్తున్న లాయర్ మహాశయుడు. 

పెళ్లికి ముందు తన కూతురు కానీ, చెల్లెలు కానీ సెక్సులో పాల్గొందని తెలిస్తే తన బంధువుల సమక్షంలో పెట్రోల్ పోసి తగలబెడతానని పబ్లిగ్గా చెప్పిన ప్రబుద్ధుడు. అటువంటి వ్యక్తిత్వంతో నిర్భయ రేపిస్టుల ఉరిని ఆపే ప్రయత్నాలు చేస్తున్న నీచుడు. ఇలా ఇంకా ఎంత తిట్టినా సరిపోదు. పాత్రికేయ సభ్యత అడ్డొస్తోంది అంతే.

మహా ఘోరం చేసిన రాక్షసుల్లాంటి రేపిస్టులని ఎప్పుడెప్పుడు ఉరేస్తారా అని దేసం మొత్తం ఏడేళ్లుగా ఏడుస్తూ ఎదురుచూస్తుంటే ఇతను అసలు వాళ్లకి ఉరి శిక్షే పడనివ్వనని ప్రగల్భాలు పలుకుతున్నాడు.

కేవలం మీడియాలో కవరేజ్ దొరుకుతుందని ఈ కేసు మీదేసుకున్నాడని ఇట్టే చెప్పొచ్చు. ఎందుకంటే నిర్భయ క్లైంట్లు డబ్బిచ్చుకోకలిగే ఆసాములు కాదు. డబ్బిచ్చే వాళ్లు ఈ చెత్త లాయర్ని ఎలాగో పెట్టుకోరు. 

అందుకే మీడియా మైలేజ్ కోసమే ఇదంతా చేస్తున్నాడని చాలామంది అంటున్నారు.
నిజానికి ఇలాంటి లాయర్లు రేపిస్టులకంటే డేంజర్ అని విడిగా చెప్పనక్కర్లేదు.