నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఫలితాల్లో కారు హై స్పీడు తో దూసుకెళ్తోంది. కడపటి వార్తలు అందేసరికి 12వ రౌండ్లు పూర్తి కాగా టీఆర్ఎస్ స్పష్టమూన ఆధిక్యతతో దూసుకెళ్తోంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు జానారెడ్డి పోటీలో ఉండడంతో అంచనాలు పెరిగాయి. తెలంగాణలో ఆ పార్టీకి ప్రస్తుతం కలిసి రావడం లేదని వరుస ఎన్నికలు తెలియజేసినప్పటికీ నాగార్జునసాగర్ లో జానారెడ్డి ప్రభావం పని చేస్తుందని భావించారు. దీంతో విభేదాలను సైతం పక్కనబెట్టి సీనియర్లు అందరూ జానారెడ్డి గెలుపు కోసం […]
రేవంత్ రెడ్డి.. మంచి మాటకారి. ప్రస్తుతం తెలంగాణలో ఫైర్ బ్రాండ్. కేసీఆర్ అంటేనే ఒంటికాలిపై లేస్తారు. కాంగ్రెస్ లో చేరి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. పీసీసీ రేసులో ఉన్నారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో జానారెడ్డి తరఫున ప్రచారం గట్టిగానే చేశారు. ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు.. ఈనెల 15న కీలక కామెంట్లు చేశారు. ‘‘17వ తారీఖున పోలింగ్ పూర్తయ్యాక.. మంత్రులు, ఇన్ చార్జ్ లుగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ప్రాంతాలకు వెళ్లిపోతారు. […]
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇక్కడ ఇక్కడ గెలుపోటములు కుల రాజకీయాల పై ఆధారపడడం తో అన్ని రాజకీయ పార్టీలు కులాలపై దృష్టి సారించాయి. మొన్నటి ఎంఎల్ సి ఎన్నికల్లో గెలుపొందిన టిఆర్ఎస్ ఇప్పుడు దూకుడుగా ఉంది. ఇప్పుడు అదే పంధాలో సాగర్ ఎన్నికల్లో కూడ విజయం సాధించాలని ఎత్తుగడలు వేస్తోంది. దుబ్బాక, జి ఎచ్ ఎం సి ఎన్నికల ఫలితాల తర్వాత ఎంఎల్ సి ఫలితాలు టిఆర్ ఎస్ కు చాలా బూస్టింగ్ ఇచ్చాయి […]
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక తప్పని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు, ఆ ప్రాంతంపై గట్టి పట్టు ఉన్న జానారెడ్డి పోటీ ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అర్ధాంతరంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించే సంప్రదాయాన్ని టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ వస్తోంది. […]
వివాదస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది భారతీయ జనతా పార్టీ. గల్లీ నేతల నుంచి ఢిల్లీ నేతల వరకు అందరిదీ ఒకే స్టైల్. నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక కాంట్రవర్సీకి తెరతీస్తూనే ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు నగరంలో అలజడికి కారణమయ్యాయి. ఓటు బ్యాంకు రాజకీయాల్లో రాటుదేలుతున్న కాషాయపార్టీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో ఎప్పుడూ ముందుంటుంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరంభించిన సర్జికల్ […]
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ దృష్టి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి మీద పడింది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంచనాలకు మించి సీట్లు సాధించిన ఉత్సాహంలో ఉన్న కమలం పార్టీకి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఊరిస్తోంది. అదే సమయంలో మరో సిటింగ్ స్థానం జారిపోకుండా కాపాడుకోవాలని టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జానారెడ్డిని తమ పార్టీలోకి రమ్మంటూ టీఆర్ఎస్, బీజేపీ ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రచారం […]