iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్‌ పార్టీ సినీయర్‌ నేత జానారెడ్డికి భారీ షాక్‌.. ఇలా జరిగిందేంటి

  • Published Nov 14, 2023 | 8:57 AM Updated Updated Nov 14, 2023 | 8:57 AM

తెలంగాణ ఎన్నికల సమరంలో కాం‍గ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డికి భారీ షాక్‌ తగిలింది. అధికారులు తీసుకున్న నిర్ణయం కారణంగా ఎన్నికల పోటీ నుంచి తప్పుకునే పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే..

తెలంగాణ ఎన్నికల సమరంలో కాం‍గ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డికి భారీ షాక్‌ తగిలింది. అధికారులు తీసుకున్న నిర్ణయం కారణంగా ఎన్నికల పోటీ నుంచి తప్పుకునే పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే..

  • Published Nov 14, 2023 | 8:57 AMUpdated Nov 14, 2023 | 8:57 AM
కాంగ్రెస్‌ పార్టీ సినీయర్‌ నేత జానారెడ్డికి భారీ షాక్‌.. ఇలా జరిగిందేంటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో కీలక ఘట్టం ముగిసింది. అతి ముఖ్యమైన నామినేషన్ల పరిశీలన పర్వం ముగిసింది. అధికారులు ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలించారు. ఈ క్రమంలో పలువురు సీనియర్‌ నేతలతో సహా స్వతంత్ర అభ్యర్థుల నామిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ జాబితాలో కీలక పార్టీలకు చెందిన సీనియర్‌ నేతలు కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డికి భారీ షాక్‌ తగిలింది. ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యింది. ఆ వివరాలు..

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి.. ఈ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే తాజాగా జానారెడ్డికి భారీ షాక్‌ తగిలింది. ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా.. వాటిలో చాలావరకు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు సమాచారం.

తాజా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. నాగార్జున సాగర్‌ బరిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు జైవీర్‌రెడ్డి బరిలో నిలుస్తున్నారు. అయితే జానారెడ్డి నామమాత్రంగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరగ్గా.. జానారెడ్డి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. జానారెడ్డి నామినేషన్‌తో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో పలువురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సరైన పత్రాలు లేకపోవడం, సరైన వివరాలు సమర్పించని కారణంగా ఈ సారి పెద్ద ఎత్తున నామినేషన్లు భారీగా తిరస్కరణకు గురయ్యాయని తెలిసింది.

రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో 2 నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. అటు కరీంనగర్‌ మానకొండూరులోనూ ఏడుగురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి 21మంది అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేయగా.. 18మంది అభ్యర్థుల నామినేషన్ లు ఆమోదం పొందాయి. సరైన పత్రాలు లేకపోవడంతో ముగ్గురి నామినేషన్‌లను అధికారులు తిరస్కరించారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 608 నామినేషన్లను అధికారులు పక్కన పెట్టారు.. తిరస్కరించారు. దాంతో మొత్తం 119 నియోజకవర్గాలకు 4,190 నామినేషన్లను ఆమోదించినట్లైంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వారు.. బరి నుంచి తప్పుకోవాలి అనుకుంటే, తమ నామినేషన్‌ను వెనక్కి తీసుకోవచ్చు. అందుకు ఇవాళ అనగా నవంబర్‌ 15, మంగళవారం మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడే వెనక్కి తీసుకుంటే, డిపాజిట్ చేసిన మనీ రూ.10వేలు వెనక్కి ఇస్తారు. లేదంటే.. ఇక ఆ డబ్బులు తిరిగి ఇచ్చేదీ లేనిదీ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.  ఇక నవంబర్‌ 30న పోలింగ్‌ జరుగుతుంది.. డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడిస్తారు.