భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త చరిత్రకు నాందిపలికారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. అసలు, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి, ఆ పేరు ఎవరు పెట్టారు? భారతదేశపు మొదటి గిరిజన రాష్ట్రపతి పేరు ద్రౌపది. మహాభారతం పాత్ర పేరును అనుకోకుండా ఆమె స్కూల్ టీచర్ పెట్టారు. ఓడియా వీడియో మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ విషయాన్ని రాష్ట్రపతి వెల్లడించారు. […]
జూలై 21న మన దేశ చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ద్రౌపది ముర్ము తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికైన రెండో మహిళ ముర్ము. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ముర్ము విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై 63 శాతం ఓట్ల మార్జిన్ తో గెలుపొందారు. 64 ఏళ్ళ ద్రౌపది ముర్ము 1958లో జూన్ 20న ఒడిషాలోని మయూర్ భంజ్ జిల్లాలో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా […]
మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత మొత్తం ఓట్ల విలువలో 50 శాతానికి పైగా ఎన్డిఎ అభ్యర్ది ద్రౌపది ముర్ము స్కోర్ చేయడంతో ఆమె రాష్ట్రపతి అయ్యారు. భారతదేశం మొదటి గిరిజన రాష్ట్రపతిని ఎన్నుకుంది. ప్రతిపక్ష నేత యశ్వంత్ సిన్హా ఓటమిని అంగీకరించారు. జులై 25న ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడు రౌండ్ల కౌంటింగ్ తర్వాత ద్రౌపది ముర్ము మొత్తం ఓట్ల విలువలో 53.13 శాతానికిపైగా ఓట్లను సాధించారు. ఇంకా ఒక రౌండ్ సమయం […]
అంతా అనుకున్నట్లే జరిగితే మన దేశ చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. తొలిసారి దేశ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులు రెండింటినీ మహిళలే అధిష్ఠించే అవకాశం దగ్గరలోనే ఉంది. రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ తరఫున జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పోటీ చేస్తుండగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మార్గరెట్ ఆల్వా ఉప రాష్ట్రపతి పదవికి చివరి నిముషంలో నామినేషన్ వేశారు.ముర్ముకు పోటీగా విపక్షాలు బీజీపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హాను బరిలోకి దించాయి. […]
హిందువులంటే ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానంగా ఇతర మతాలకు చెందినవారు తప్ప, భారతదేశంలోని మిగిలినవారంతా హిందువులేనని చెబుతుంటారు. కాని మేం హిందువులం కాదు, మాకు సొంత మతముంది. దాన్ని గుర్తించమని జార్ఖండ్, ఒడిశా, అస్సాంతో సహా ఐదు రాష్ట్రాలకు చెందిన గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ మతాన్ని ‘సర్నా’గా గుర్తించాలని, జనాభా గణనలో తమ మతాన్ని కూడా చేర్చాలని వాళ్లు ఉద్యమం చేస్తున్నారు. తమ దేవతల ఆశీర్వాదం కోరుతూ జంతర్ మంతర్ వద్ద సామూహిక ప్రార్థనలు […]