iDreamPost
android-app
ios-app

క్లింకారతో కలిసి రాష్ట్రపతిని కలిసిన ఉపాసన.. మాకెప్పుడు చూపిస్తారంటున్న ఫ్యాన్స్!

  • Published Mar 16, 2024 | 9:31 AM Updated Updated Mar 16, 2024 | 9:31 AM

Upasana Meeting the President: మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ఫోటోలో అభిమానుతో పంచుకుంటారు.

Upasana Meeting the President: మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ఫోటోలో అభిమానుతో పంచుకుంటారు.

  • Published Mar 16, 2024 | 9:31 AMUpdated Mar 16, 2024 | 9:31 AM
క్లింకారతో కలిసి రాష్ట్రపతిని కలిసిన ఉపాసన.. మాకెప్పుడు చూపిస్తారంటున్న ఫ్యాన్స్!

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఆయన కుటుంబం నుంచి పలువురు హీరోలు వెండితెరపై రాణిస్తున్నారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారారు. రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన.. భార్యగానే కాకుండా బిజినెస్ ఉమెన్ గా తమకంటూ ప్రత్యే ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. బిజినెస్, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో తరుచూ పాల్గొంటు వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టీవ్ గా ఉంటారు. తాజాగా ఉపాసన తన కూతురు క్లింకార తో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో మెడిటేషన్ కి సంబంధించి జరుగుతున్న గ్లోబల్ స్పిర్చువాలిటీ మహూత్సవ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ఉపాసన తన కూతురు క్లింకారతో వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమలేష్ దాజిని కలిశారు. ఇరువురు క్లింకారను దీవించారు. ఇందుకు సంబంధంచిన ఫోటోలు ఇన్ స్టాలో షేర్ చేసింది. ఉపాసన ఎక్కడ కూడా క్లింకార ఫోటో మాత్రం రివీల్ కాకుండా చూసింది. ‘ఈరోజు ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న గ్లోబల్ స్పిర్చువాలిటీ మహూత్సవ్ లో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముజీ ని నా కుమార్తె క్లింకార కొణిదెలలతతో కలిశాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది.. ఈ అవకాశం ఇచ్చిన కామష్ దాజీకి ధన్యవాదాలు’ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

Upasana with Klinkara meeting the President

రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముని కలిసిన సందర్భంగా ఉపాసన తన కూతురు క్లింకార ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడింది. తాజాగా ఉపాసన పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తూ.. మెగా ప్రిన్సెస్ క్లింకారను మాకెప్పుడు చూపిస్తారు? ఒక్కసారి చూపించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ సతీమణిగా ఎప్పుడూ ఆయన వెన్నంటి ఉంటూనే.. బిజినెస్ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు ఉపాసన. తన అత్తమ్మ కొణిదెల సురేఖ తో కలిసి అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ మద్య తన కుటుంబ సభ్యులతో కలిసి అయోద్య రామ మందిరంలోని బాల రాముడిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని కలిశారు. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

 

View this post on Instagram

 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişanadolucasino girişgrandpashabet