కేంద్ర ప్రభుత్వంలోని అతిప్రధానమైన శాఖల్లో రక్షణశాఖ ఒకటి. ఈ రక్షణ శాఖలో త్రివిధ దళాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం.. రక్షణశాఖను పటిష్టంగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు అనేక చర్యలు తీసుకుంటుంది. అదే విధంగా నౌకదళంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చింది. కొత్త కొత్త యుద్ధనౌకలను, ఆధునాత సౌకర్యాలతో తయారు చేసి..నౌకదళంలో ప్రవేశపెడుతున్నారు. విదేశీయ పరిజ్ఞానంతోనే తయారు చేసినవే కాకుండా స్వదేశీ నౌకలను కూడా రూపొందిస్తున్నారు. ఇప్పటికే అనేక యుద్ధనౌకలు నౌకదళంలోకి చేరగా.. తాజాగా ఐఎన్ఎస్ విధ్యగిరి అనే మరో యుద్ధ నౌక..నౌకదళంలో చేరింది. మరి.. ఈ కొత్త యుద్ధ నౌక ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
భారత నౌకదళ అమ్ముల పొదిలోకి అధునాతన స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ వింధ్యగిరి చేరింది. గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కలకత్తాలోని హుగ్లీ నది తీరంలో ఈ నౌకను అధికారికంగా భారత నావికా దళంలోకి ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ ఆనందబోస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కీలక ప్రసంగం చేశారు. ఆమె మాట్లాడుతూ.. దేశీయంగా నిర్మించిన వింధ్యగిరి యుద్ధనౌక దేశ స్వావలంబనకు చిహ్నమని తెలిపారు. ఆత్మనిర్భర్, భారత్ కు, దేశం సముపార్జించిన సాంకేతిక ప్రగతికి ఇది నిదర్శనమన్నారు. సముద్ర జలాలపై భారత్ పట్టు పెంచుకునేందుకు ఇదొక ముందడుగని తెలిపారు.
ఈ నౌకను రూపొందించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ కు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఇక శుత్ర దేశ రాడర్లకు చిక్కకుండా స్వదేశీ పరిజ్ఞానంతో ఏడు యుద్ద నౌకలను రూపొందించాలని భారత ప్రభుత్వం ప్రాజెక్ట్-17ఏ ను ప్రారంభించింది. ఈ ఏడు నౌకల్లో వింధ్యగిరి ఆరో యుద్ధ నౌక. ఈ యుద్ధ నౌక పీ17ఏ రకానికి చెందినది. ఈ నౌకలో వినియోగించిన పరికరాలు, వ్యవస్థలు 75 శాతం వరకు దేశీయంగా తయారైనవి. విస్తృత ట్రయల్స్ అనంతరం భారత నేవికి అప్పగించనున్నారు. మరి.. ఐఎన్ఎస్ వింధ్యగిరి .. నౌకాదళంలో చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మా అమ్మ కల నెరవేరింది.. రింకూ సింగ్ భావోద్వేగం!