బెంగాల్ ఎన్నికలు బీజేపీ కు, అధికార తృణమూల్ కాంగ్రెస్ కు మధ్య పోటాపోటీగా సాగుతున్న సమయంలో అసలు బెంగాల్ ను మూడు దశాబ్దాలకు పైగా పరిపాలించిన సిపిఎం పార్టీ పరిస్థితి ఏమిటి? అసలు పోటీలో లేని లెఫ్ట్ పార్టీలు దేనికోసం ఆరాట పడుతున్నాయి? క్రమక్రమంగా దేశంలో ఉనికి కోల్పోతున్న కమ్యూనిస్టు పార్టీల ఓటుబ్యాంకు ఎటు పోతుంది? ఏ పార్టీల వైపు మళ్ళుతుంది అన్నది కీలకం. ముఖ్యంగా బెంగాల్లో ఒకప్పుడు బలంగా ఉండే వామపక్షాల ఓటుబ్యాంకు ఇప్పుడు ఏ […]
ఒకప్పుడు బెంగాల్ కమ్యూనిస్టులకు కంచు కోట. దశాబ్దాల పాటు ఎదురులేని శక్తిగా రాజ్యమేలిన కమ్యూనిస్టుల ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మమతా బెనర్జీ రాజకీయ వ్యూహాల ముందు కమ్యూనిస్టు పార్టీలు కుప్పకూలక తప్పలేదు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. కనీసం కమ్యూనిస్టు పార్టీలు ప్రధాన పక్ష హోదాను కూడా నిలబెట్టుకోలేని స్థాయికి దిగజారిపోయాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ కి బీజేపీ దూకుడు తోడవ్వడంతో ఎర్రజెండా రెపరెపలకు రెడ్ సిగ్నల్ పడ్డట్లయ్యింది. దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా […]
గడచిన సాధారణ ఎన్నికల్లో జనసేనతో కలసి చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన సీపీఐ, సీపీఎంలు ఎన్నికల ఫలితాల ఆ తర్వాత.. జనసేన హ్యాండ్ ఇచ్చి బీజేపీతో జతకట్టడంతో కమ్యూనిస్టులు ఎవరిదారి వారు చూసుకున్నారు. ఈ క్రమంలో సీపీఎం పార్టీ ఏ పార్టీకి అనుకూలంగా ఉండకుండా.. తటస్థ వైఖరిని అనుసరిస్తుండగా.. సీపీఐ మాత్రం తెలుగుదేశం పార్టీ దారిలో నడుస్తోంది. సీపీఐ పార్టీలోని ఇతర నాయకులు తీరు ఎలా ఉన్నా.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాత్రం చంద్రబాబు మనసెరిగి […]
ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఏకం కాబోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇందుకు ఆయా పార్టీల నాయకులు ఇస్తున్న స్టేట్మెంట్లు, ఇప్పటి వరకు స్నేహం కొనసాగించిన వారిపై వేస్తున్న సెటైర్లనే నిదర్శనంగా చూపిస్తున్నారు. అధికారం చేపట్టి వైఎస్సార్సీపీ సంక్షేమ పాలనీలో బిజీబిజీగానే ఉంది. కేంద్రంలో ఉన్న అధికారంతో రాష్ట్ర బీజేపీ, వారితో ఉన్న స్నేహంతో జనసేనలు కూడా తమ వంతు బిజీలోనే ఉన్నారు. ఇక ఏపీలో రాజకీయంగా ఖాళీగా ఉన్న పార్టీలను గురించి […]
ఎన్నో నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు రానే వచ్చాయి. మూడు రకాల స్థానిక సంస్థలకు మార్చి 29లోపు ఎన్నికలు, ఫలితాలు పూర్తి అయిపోతాయి. ఎండా కాలం మొదలు కాలేదు.. కానీ ఈ ఎన్నికలు పార్టీల్లో చెమటలు పట్టించే వేడిని రగిలించాయి. అభివృద్ధి కేంద్రంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతాయనుకుంటే.. ఆశ్చర్యకంగా బీసీ అజెండా ముందుకొచ్చింది. తొమ్మిది నెలలుగా తాము చేస్తున్న మంచి పనులే తమను గెలిపిస్తాయని అధికార వైఎస్సార్సీపీ ధీమాగా ఉంది. ఎప్పటిలాగే సింగిల్గానే […]
అక్కడ ఉన్నది పది వార్డులు.. గెలిచింది స్వతంత్రుడితో కలుపుకొని ఏడు పార్టీలు… “అమరచింత” పాత సంస్థానం ..2009 పునః విభజనలో ఈ నియోజకవర్గం రద్దు అయ్యి కొత్తగా దేవరకద్ర ఏర్పడింది. కానీ అమరచింత మండలం మక్తల్ నియోకవర్గంలో కలిసిపోయింది. అప్పట్లో అమరచింత అంటే కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నంతగా ఆయన ఆధిపత్యం ఉండేది. కొత్త కోట దయాకర్ రెడ్డి పూర్వికులు అమరచింత సంస్థాన్ దివాన్ గా ఉండేవారు.