iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు!

తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఎం నాయకుడు గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఎం నాయకుడు గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు.

బ్రేకింగ్: CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు!

మారుతున్న జీవనశైలితో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ మధ్యకాలంలో జనాలను భయపెడుతున్న సమస్య ఏదైనా ఉందంటే అది గుండెపోటు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుకుని పెద్ద వయసు వారి దాక గుండెపోటుకు గురవుతున్నారు. అప్పటి దాక సరదాగా గడిపిన వారు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఎం నాయకుడు గుండెపోటుకు గురయ్యారు. ఇంట్లో ఉన్న సమయంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండె పోటుకు బారీన పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఇంట్లో ఉన్న సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం తమ్మినేనిని హుటాహుటిన హైదరాబాద్‌కు ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రం ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తమ్మినేని గుండెపోటుకు గురయ్యాడనే విషయం తెలుసుకున్న సీపీఎం లీడర్లు, ఇతర పార్టీల నాయకులు, సన్నిహితులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.