P Venkatesh
సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం నిన్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఆయనకు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నది.తాజాగా ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదలైంది.
సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం నిన్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఆయనకు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నది.తాజాగా ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదలైంది.
P Venkatesh
నిన్న (మంగళ వారం) సీపీఎం లీడర్ తమ్మినేని వీరభద్రం తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తెల్ధార్ పల్లిలోని నివాసంలో తమ్మినేని గుండెపోటుకు గురయ్యారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఖమ్మం లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత తమ్మినేని ఆరోగ్యం కాస్త విషమంగా ఉన్నట్లు తేలడంతో మెరుగైన చికిత్స కోసం వెంటిలేటర్ సాయంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే తాజాగా తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిన్నటితో పోలీస్తే మెరుగైందని వైద్యులు వెల్లడించారు. ఆయన ప్రస్తుతం గుండె, కిడ్ని, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు ఏఐజీ వైద్యులు తెలిపారు. వీరభద్రంకు ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని.. ఆ నీరు తొలగించడానికి ప్రయత్నిస్తున్నామని డాక్టర్ల బృందం వెల్లడించింది. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ల వైద్యుల బృందం ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు బులిటెన్ విడుదల చేశారు. ఇక తమ్మినేని అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న సీపీఎం నాయకులు, ఇతర పార్టీల లీడర్లు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.