రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం రాజకీయ వేడిని రాజేస్తోంది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సందడి కనిపిస్తుంటే.. తెలుగుదేశం మాత్రం దీన్ని వక్రీకరించి చెబుతోంది. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పుదోవ పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో రాయలసీమలో జరగనున్న ఓ సభ ద్వారా ప్రజలకు నిజానిజాలు చెప్పనుంది వైసీపీ. రాజధాని వద్దు.. సాగునీటి ప్రాజెక్టులే ముద్దు.. అంటూ అనంతపురంలో నేడు బహిరంగ సభ నిర్వహించేందుకు వైసీపీ […]
Trending in Social Media చాగంటీ నాగశ్రీనివాస సతీష్ అలియాస్ , సతీష్ చాగంటీ . టీడీపీ సోషల్ మీడియాలో అత్యంత కీలక వ్యక్తి .2014 లో బ్రింగ్ బ్యాక్ బాబు క్యాంపెన్ తో వెలుగులోకి వచ్చిన ఈ వ్యక్తి . ఆ సమయంలో వైఎస్ జగన్ పై లక్ష కోట్లు అంటూ తీవ్ర అసత్య ఆరోపణలు చేయటంలో కానీ , బాబే రావాలి అనే క్యాంపెన్ నడపటంలో , టీడీపీ అనుకూల వర్గ , ముఖ్యంగా […]
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని, దేశంలోనే అత్యంత సీనియర్ అని తనని తాను అభివర్ణించుకునే ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని సార్లు ఎదుటివారి తెలివితేటలు చాలా తక్కువగా అంచనా వేస్తారు. తనని తాను మహా మేధావిగా అనుకోవడం వల్ల వచ్చిన లక్షణమో, లేక వయసు వల్ల వచ్చిన చాదస్తమో తెలియదు కానీ ఈ మధ్య ఈ లక్షణం వారిలో బాగా ముదిరిపోయింది. అన్ని స్థానాలకు రాజీనామా చేసి, రాజధాని వికేంద్రీకరణ అన్న అంశం […]
చంద్రబాబుతో మనకు ఏ సమస్యా లేదు. చాలా పారదర్శకంగా ఉంటాడు. యూనివర్సిటీ రోజుల నుంచి ఆయన లక్ష్యం అధికారమే. దాని కోసం అబద్ధాలు చెబుతాడు, ఎవరినైనా కౌగిలించుకుంటాడు. సొంత మామను కూడా పోటు పొడుస్తాడు. కమ్యూనిస్టులతో చేతులు కలిపినప్పుడు మార్క్సిజమ్ స్పీచ్ లివ్వడు, బీజేపీతో కలిస్తే హిందుత్వ గురించి గుండెలు బాదుకోడు. TRSతో కలిస్తే తెలంగాణ గురించి ఉద్వేగ ఉపన్యాసాలు ఇవ్వడు. అధికారం కోసం ఆయన మావోయిస్టులతో కూడా కలిసిపోతాడు. అక్కర్లేదనుకుంటే ఎన్కౌంటర్లు చేయించగలడు. కొంచెం బుద్ధి […]
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడటంతో రాయలసీమలోని తెలుగుదేశం ఊపిరి పీల్చుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో స్టే విధిస్తూ సుప్రీం తీర్పు రావడంపై తమ్ముళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియపై సుప్రీంకోర్టు నాలుగు వారాల పాటు స్టే విధిస్తూ ఆదేశాలు ఇవ్వడంతో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నేతలకు ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. గ్రామ స్థాయి నుంచి వైసీపీ బలంగా ఉండటంతో […]
అందరు ఊహించినట్టు ఈ నెల 20 న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో రాజధాని తరలింపు, అధికార వికేంధ్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి పై ప్రభుత్వానికి జియన్ రావు, బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదికలతో పాటు గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామ కృష్ణ కమిటీ నివేదిక పై కూడా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే రాష్ట్రంలో అభివృద్ధి వికేంధ్రీకరణతో పాటు కార్యానిర్వాహక రాజధాని, శాసన నిర్వాహక రాజధాని, […]
పెద్దలు , మేధావులు , అనుభవజ్ఞులు మొదట్నుండీ మొత్తుకొంటుంది ఈ విషయం పైనే , రాజధాని ఏ ఒక్కరిదో , లేదా కొందరు సమూహానిదో , ఓ వర్గానిదో కారాదు . దురదృష్టవశాత్తు అమరావతిలో అదే జరుగుతోంది అని. రాష్ట్రానికి సంబంధించిన రాజధాని విషయంలో ఒకరి పొట్ట గొట్టి మరొకరి పొట్ట నింపడం అనే ప్రస్తావన ఎందుకొస్తుంది . చంద్రబాబు భూసేకరణ చట్టం ప్రకారం భూమి సేకరించి తగు పరిహారం ఇచ్చింటే అసలు ఈ వివాదం ఉండేదా. […]
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా చెప్పబడే పోలవరానికి కేంద్రం నిధులు విడుదల చేసింది. గడిచిన రెండేళ్ళలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేయడం ఇదే తొలిసారి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో 3,650 కోట్లు కేంద్రం నుండి రియింబర్స్ అవ్వాల్సి ఉండగా కేంద్రం 1 ఏప్రిల్ 2014 ముందు ప్రాజెక్టుకు ఖర్చు పెట్టిన వ్యయానికి సంబంధించిన ఆడిట్ స్టేట్మెంటును పంపితేనే నిధులు మంజూరు చేస్తాం అని నాటి ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పింది. కానీ […]
ఒంగోలు లో గురువారం రాజధాని అంశం పై జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ ని కవర్ చేస్తూ విధి నిర్వహణలో హఠాతుగా గుండె పోటుతో మరణించిన ఈటివి-భారత్ కి చెందిన రిపోర్టర్ మరియు విడియోగ్రాఫర్ వీరగంధం సందీప్ మృతిని రాజధాని వివాదంలోకి లాగి తమకు అనుకూలంగా మలచుకొని రాజకీయంగా లభ్ది పొందాలని చేసిన పధక రచన ఆదిలోనే తెలుగుదేశం పార్టీ ని ఆ పార్టీ నాయకులని అభాసుపాలు చేసింది. వివరాలులోకి వెళితే.. గురువారం రాత్రి […]
ప్రతి పుట్టుకకు ఓ కారణం ఉంటుందంటుంటారు ..! ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, ప్రతి మరణానికీ ఓ కారణం ఉంటుంది. అది సహజమైంది కావొచ్చు.. అసహజమైంది కావొచ్చు…! ఐతే సదరు కారణాన్నిఏమార్చడం, మరోరకంగా చూపడం చేస్తే మాత్రం ఒక రకంగా సదరు వ్యక్తిని తిరిగి హత్య చేయడమే..! రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఇప్పుడిదే పనిలో ఉంది. ఎక్కడెవరు చనిపోయినా దాన్ని అమరావతితో ముడిపెట్టి శవరాజకీయం చేస్తోంది. నాకు కసి తీరక పొతే చచ్చిన […]