iDreamPost

రాజధానిపై అసత్య వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

రాజధానిపై అసత్య వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

ప్రజలకు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అసత్య వార్తల ప్రచారం బాగా పెరిగిపోయింది. ఫలానా వార్త నిజమని నమ్మేలోపే ఆ వార్త అసత్యం అని తెలియడానికి కొంచెం సమయం పడుతుంది.

ముఖ్యంగా వార్తలు నిజమో కాదో తెలుసుకోకుండానే దాన్ని మరొకరికి షేర్ చేయడం వల్ల అబద్దాలను నిజమని కొందరు విశ్వసిస్తున్నారు. కొందరేమో ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని అసత్యపు వార్తలను తమ స్వార్ధ ప్రయోజనాల కోసం సృష్టించి ఆ వార్తలను వ్యాప్తి చేస్తున్నారు.

Read Also: రాజధాని రాజకీయం వక్రమార్గం పడుతోందా ?

ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని మార్పు విషయంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను మరింత రెచ్చగొట్టే విధంగా కొన్ని వార్తలు, వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ వీడియో వైరల్ అయ్యింది.

ఎక్కడో తమిళనాడులో జరిగిన ఆత్మహత్య వీడియోను అమరావతిలో జరిగినట్లు కొందరు ఉద్దేశ్యపూర్వకంగా ఆ వీడియోలను వైరల్ చేసారు. ఇకపై ఆ అసత్యపు వీడియోను ఉద్దేశ్యపూర్వకంగా షేర్ చేసినా,అసత్య వార్తలను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించినా,ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా చర్యలు తీసుకుంటామని గుంటూరు ఐజి వినీత్ బ్రిజ్లాల్ హెచ్చరించారు.

కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తమిళనాడులో జరిగిన సంఘటనను అమరావతిలో జరిగినట్లు అసత్య వార్తలను ప్రచారం చేసినా,కావాలని షేర్ చేసి ప్రజలలో అల్లర్లు రేపడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు ఐజీ స్పష్టం చేసారు. అలాంటి అసత్య వార్తలను నమ్మొద్దని,ప్రచారం చేయొద్దని హితవు పలికారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి