iDreamPost

చంద్ర‌బాబు/ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

చంద్ర‌బాబు/ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

చంద్రబాబుతో మ‌న‌కు ఏ స‌మ‌స్యా లేదు. చాలా పార‌దర్శ‌కంగా ఉంటాడు. యూనివ‌ర్సిటీ రోజుల నుంచి ఆయ‌న ల‌క్ష్యం అధికార‌మే. దాని కోసం అబద్ధాలు చెబుతాడు, ఎవ‌రినైనా కౌగిలించుకుంటాడు. సొంత మామ‌ను కూడా పోటు పొడుస్తాడు. క‌మ్యూనిస్టుల‌తో చేతులు క‌లిపిన‌ప్పుడు మార్క్సిజ‌మ్ స్పీచ్ లివ్వ‌డు, బీజేపీతో క‌లిస్తే హిందుత్వ గురించి గుండెలు బాదుకోడు. TRSతో క‌లిస్తే తెలంగాణ గురించి ఉద్వేగ ఉప‌న్యాసాలు ఇవ్వ‌డు. అధికారం కోసం ఆయ‌న మావోయిస్టుల‌తో కూడా క‌లిసిపోతాడు. అక్క‌ర్లేద‌నుకుంటే ఎన్‌కౌంట‌ర్లు చేయించ‌గ‌ల‌డు. కొంచెం బుద్ధి , తెలివి ఉంటే చాలు బాబు ప్ర‌మాద‌కారి అని మ‌నం గుర్తించి దూరంగా ఉండొచ్చు.

స‌మ‌స్య అంతా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తోనే. ప‌వ‌న్‌కి ప‌వ‌నే స‌మ‌స్య అయిన‌పుడు మ‌ధ్య‌న మ‌న‌కేంటి అంటారా? మ‌న‌కు ఇష్టం ఉన్నా లేక‌పోయినా ప‌వ‌న్‌ స్టేజీ నాట‌కాన్ని కొంత కాలం చూడాల్సిందే.

ప‌వ‌న్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో , ఏం చేస్తాడో ఎవ‌రికీ తెలియ‌దు. ఆయ‌న చెగువేరా అంటాడు. బీజేపీతో క‌లిసిపోతాడు. అధికారం నాకు అవ‌స‌రం లేదంటాడు. జ‌నం కూడా ఆయ‌న మాటలు న‌మ్మి ఓడించారు. ల‌క్ష పుస్త‌కాలు చ‌దివి ఫెయిల్ మార్కులు తెచ్చుకున్నాడు. మాయావ‌తికి దండం పెడ‌తాడు. కేసీఆర్ సంగ‌తి చూస్తానంటాడు. తెలంగాణ‌లో పోటీనే లేదు పొమ్మంటాడు.

20 ఏళ్లు జ‌నంలో ఉండి పోరాడ‌తాను అంటాడు. నెల‌కోసారి జ‌నానికి క‌నిపిస్తాడు. లాంగ్‌మార్చ్‌ని షార్ట్‌క‌ట్‌లో న‌డిపిస్తాడు. సీమ‌ని ఉద్ధ‌రించేది తానేనంటాడు. సీమ ప్ర‌జ‌ల్ని ఫ్యాక్ష‌నిస్టుల‌ని తిడ‌తాడు.

కార్య‌క‌ర్త‌లే త‌న బ‌లం అంటాడు. మీ వ‌ల్లే ఓడిపోయాన‌ని శాప‌నార్థాలు పెడ‌తాడు. అస‌లు మీ ఎన్నిక‌ల గుర్తు ఏంటంటే జ‌న‌సేన నాయ‌కులు కూడా త‌డుము కోకుండా చెప్ప‌లేరు. అదీ ప‌రిస్థితి. జాత‌ర‌లో వెలుగుతున్న కాగ‌డా ప‌ట్టుకుని అటూఇటూ తిప్పుతూ ఫీట్స్ చేస్తుంటారు.

ప‌వ‌న్ , కాగ‌డాతో ఫీట్స్ చేస్తుంటే బీజేపీ కౌగ‌లించుకోడానికి వెళుతుంది. ఆల్రెడీ క‌మ్యూనిస్టుల‌కి కాలింది. ఇప్పుడు బీజేపీ వంతు. ఒళ్లు కాలి వాత‌లు తేలితేనే కానీ, త‌త్వం బోధ‌ప‌డ‌దు.

చంద్ర‌బాబుకి, ప‌వ‌న్‌కి తేడా ఏంటంటే..

బాబు ఇత‌రుల‌కి గొయ్యి తీస్తూ ఉంటాడు.
ప‌వ‌న్ తాను గోతిలో ఉండి అంద‌రినీ లాగుతూ ఉంటాడు.
ప‌వ‌న్ సేనానే కానీ, ఆయుధాలు లేవు.
గ‌డ్డి పోచ‌ల్ని గ్రాఫిక్స్‌లో ఆయుధాల‌ని భ్ర‌మ‌ప‌డ‌తాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి