iDreamPost

కమల్ హాసన్‏‌పై దర్శకుడు ఫిర్యాదు..కారణం ఇదే..!

Case Files Against Kamal Haasan: సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్నారు కమల్ హాసన్. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Case Files Against Kamal Haasan: సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్నారు కమల్ హాసన్. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

కమల్ హాసన్‏‌పై దర్శకుడు ఫిర్యాదు..కారణం ఇదే..!

భారతీయ సినీ ఇండస్ట్రీలో విశ్వనటుడుగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. చిత్ర పరిశ్రమలో ఆయన ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసి మెప్పించారు. కెరీర్ ప్రారంభం నుంచి విలక్షణ సినిమాలు, విభిన్న పాత్రలతో కోట్ల మంది అభిమానం సంపాదించుకున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. కమల్ హాసన్ కెరీర్ లో ఎన్నో సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కొన్ని దారుణమైన డిజాస్టర్ అయ్యాయి. ఓ భారీ డిజాస్టర్  సినిమా ఇప్పుడు ఆయనను వివాదంలో నెట్టింది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ కాంటాక్ట్ ఉల్లంఘనకు పాల్పపడ్డారని ఫిర్యాదు చేశారు. ఇంతకీ కమల్ పై కేసు ఎవరు పెట్టారు? కారణం ఏంటో తెలుసుకుందాం.

విశ్వనటుడు కమల్ హాసన్ పై దర్శకుడు, నిర్మాతలు అయిన లింగు స్వామి, సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేశారు. కమల్ హాసన్ నటించిన భారీ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటి ‘ఉత్తమ విలన్’. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, తిరుపతి బ్రదర్ ఫిలిమ్స్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఉత్తమ విలన్ మూవీకి రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ రిలీజ్ విషయంలో పలు వివాదాలు చుట్టు ముట్టి చివరికి థియేటర్లోకి వచ్చింది. కానీ ఆశించిన ఫలితం రాలేదు సరికదా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీకి నిర్మాతలుగా కమల్ హాసన్, తిరుపతి బ్రదర్స్ అధినేతలు లింగు స్వామి, సుభాష్ చంద్రబోస్ అన్న విషయం తెలిసిందే.

Kamalhasan

‘ఉత్తమ విలన్’ మూవీ వల్ల తాము పెద్ద ఎత్తున అప్పుల్లో మునిగిపోయామని తిరుపతి బ్రదర్స్ కోలీవుడ్ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. కమల్ హాసన్ పై నమ్మకంతో భారీ అంచనాలతో నిర్మించిన ఈ మూవీ వల్ల ఆర్థికంగా దెబ్బతిన్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉత్తమ విలన్ చిత్రం వల్ల తమతో రూ.30 కోట్ల సినిమా చేస్తామని కమల్ హాసన్ అప్పట్లో మాట ఇవ్వడం వల్లే ఈ మూవీ నిర్మాతలుగా వ్యవహరించామని.. కానీ కమల్ మాత్రం ఆ హామీ నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉత్తమ విలన్ స్క్రిప్ట్ ను కమల్ హాసన్ చాలా సార్లు తన ఇష్టానుసారంగా మార్చడం వల్ల డిజాస్టర్ అయ్యిందని ఆరోపించారు. నష్టాన్ని పూడ్చేందుకు మరో మూవీ నిర్మిస్తానని తమ సంస్థకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు దానిపై స్పందించలేదు. గతంలో ‘దృశ్యం’ మూవీ రిమేక్ చేద్దామని వెళ్తే ముఖం చాటేశారు. ఆ మూవీ వేరే నిర్మాత చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో తప్పని పరిస్థితిలో కమల్ పై ఫిర్యాదు చేయాల్సి వచ్చినట్లు లింగుస్వామి పేర్కొన్నారు.

 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి