iDreamPost

ఏడాది తర్వాత OTTలోకి వస్తోన్న మల్లేశం డైరెక్టర్ మూవీ

మల్లేశం మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్ రాజ్ రాచకొండ. ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతికింది మల్లేశం కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. దీనికి అవాార్డులు వచ్చిన సంగతి విదితమే. ఇతడు డైరెక్షన్ లో గత ఏడాది ఓ మూవీ వచ్చింది. అదే

మల్లేశం మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్ రాజ్ రాచకొండ. ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతికింది మల్లేశం కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. దీనికి అవాార్డులు వచ్చిన సంగతి విదితమే. ఇతడు డైరెక్షన్ లో గత ఏడాది ఓ మూవీ వచ్చింది. అదే

ఏడాది తర్వాత OTTలోకి వస్తోన్న మల్లేశం డైరెక్టర్ మూవీ

ప్రియదర్శి, అనన్య నాగళ్ల కాంబోలో వచ్చిన మూవీ మల్లేశం. చేనేత కార్మికుడు, ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతికింది మల్లేశం కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాజ్ రాచకొండ. 2019 జూన్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాను తన భుజాలకు ఎత్తుకున్నాడు రాజ్. అతడే రచన అందించడంతో పాటు నిర్మాతగా మారాడు. స్టూడియో 99 పతాకంపై రాజ్, శ్రీ అధికారి నిర్మించారు. కేవలం రూ. 2.5 కోట్లతో సినిమాను తెరకెక్కించగా..రూ. 5 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. అవార్డులను కూడా దక్కించుకుంది.  సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును సొంతం చేసుకుంది ఈ చిత్రం. దర్శకుడిగా రాజ్‌కు కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

ఈ దర్శకుడు బాలీవుడ్‌లో దర్శకత్వం వహించిన మూవీ 8 ఏఎం మెట్రో. ప్రముఖ రచయిత మల్లాది వెంటక కృష్ణ మూర్తి నవల అందమైన జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గత ఏడాది మేలో విడుదలయ్యింది. ఇందులో గుల్హన్ దేవయ్య, రేయ్, వైల్డ్ డాగ్ ఫేం సయామీ ఖేర్ హీరో హీరోయిన్లుగా నటించారు. కల్పిక గణేష్, నిమిషా నాయర్, ఉమేశ్ కామత్, మధు స్వామినాథన్ కీలక పాత్రలు పోషించారు. రూ. 4 కోట్లతో స్టూడియో 99 పతాకంపై రాజ్ రాచకొండ, కిశోర్ గంజి నిర్మించారు. మంచి రివ్యూస్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి రాబోతుంది. జీ 5లో ఈ నెల 10 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఓటీటీ సంస్థ. మే 10 అర్థరాత్రి నుండి ఈ సినిమాను చూడొచ్చు.

కాగా, ప్రముఖ కవి గుల్జర్ రాసిన కొన్ని పద్యాలు కూడా ఈ మూవీలో ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ మెట్రోలో తెరకెక్కించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మహారాష్ట్రలోని నాందేడ్‌లో భర్త, పిల్లలతో ఉంటుంది ఇరావతి (సాయామీ ఖేర్). హైదరాబాద్‌లో ఉన్న చెల్లెలి నుండి ఎమర్జెన్సీ కాల్ వస్తుంది. తనకు బ్లీడింగ్ అయ్యిందని, భర్త అమెరికా వెళ్లడంతో తనకు నాలుగు రోజులు తోడు రమ్మని పిలుస్తుంది. ఆమెకు రైలు అంటే భయం. భర్త బలవంతంగా ఎక్కించడంతో అలా హైదరాబాద్ వస్తుంది. చెల్లెలు ఇంటికి వెళ్లాలంటే మెట్రో ఎక్కాలి. అప్పుడు హీరో ప్రీతమ్ ఆమెకు సాయం చేస్తాడు. అలా వారి పరిచయం మొదలై.. ఎక్కడకు వరకు దారి తీసింది అనేది కథ. ఇందులో ప్రీతమ్ భార్య పాత్రలో మృదుల నటించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి