iDreamPost

సినీ రంగంపై కత్తి దూస్తున్న టీడీపీ…!

సినీ రంగంపై కత్తి దూస్తున్న టీడీపీ…!

సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలను నిషేధించాలి…! నిర్మాతలు, దర్శకులు, నటులు, డిస్ట్రిబ్యూటర్ల కళ్లల్లోనుంచి రక్తం పారిస్తే అమరావతి ఉద్యమం సక్సెస్‌ ఐనట్టే..! సోషల్‌ మీడియాలో తెలుగు తమ్ముళ్లు వల్లె వేస్తున్న ప్రవచనాల్లో ఇదొక శాంపిల్‌ మాత్రమే…! తెలుగుదేశం..తెలుగు సినీ పరిశ్రమ…ఈ రెండింటి మధ్యా పేరులోనే కాదు…అన్నింటా సారూప్యమే…సాన్నిహిత్యమే…! ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అనుబంధం..! కానీ, ఇప్పుడెందుకో టీడీపీ సినీ పరిశ్రమపై కత్తి దూస్తోంది. అయితే మంత్రించిన ఆ కత్తి ఇండస్ట్రీలోని కొంత మందినే గాయపరిచే ందుకు ఉద్దేశించినదనే వాదన సర్వత్రా వినిపిస్తోంది…!

సినీ మూలాలే పునాదిగా…

తెలుగుదేశం మూలాలు సినీ పరిశ్రమలో ఉన్నాయనే విషయం అందరకీ తెలసిందే..! ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొంది…80వ దశకం ప్రారంభంలో టీడీపీని ఏర్పాటు చేశారు. దాంతో సహజంగానే ఆ పార్టీకి సినీ ఇండస్ట్రీతో పరిచయాలు, సంబంధాలు నిరాఘాతంగా కొనసాగాయి. మురళీమోహన్, రామానాయుడు సహా పలువురు నటులు, నిర్మాతలు, దర్శకులు ఆ పార్టీలో చేరారు. వీరిలో కొంత మంది ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక విధంగా చంద్రబాబును..ఎన్టీఆర్‌కు దక్కర చేసీందీ సినిమానే అని చెప్పాలి. అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా చంద్రబాబు ..ఎన్టీఆర్‌ దృష్టిలో పడటం..బంధుత్వం కుదరడం చక చకా జరిగిపోయాయి.

ఎదురు నిలిచిన కృష్ణ.. 

ఎన్టీఆర్‌ మాటే వేదవాక్కుగా సాగుతోన్న సినీ పరిశ్రమలో సూపర్‌ కృష్ణ ఆయనకు ఎదురొడ్డి నిలిచారు. ఎన్టీఆర్‌ ముందు నిలబడి మాట్లాడాలంటేనే బయపడే పరిశ్రమలో ఏకంగా ఆయనకే ఎదురెళ్లి…ధీశాలిగా గుర్తింపు పొందారు. ఎన్టీఆర్‌ ఆంగికవ్యవహారాలను గుర్తుకు తెచ్చేలా పలు చిత్రాలు నిర్మించారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఏలూరు నుంచి ఎంపీగా గెలుపొందారు. కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీతో అనుబంధం కొనసాగించారు. దీంతో తెలుగుదేశం నాయకులకు, అభిమానులకు ఎప్పటి నుంచో కృష్ణపై ద్వేషం అలానే ఉండిపోయింది. ఆ ద్వేషం కారణంగానే మహేష్‌ సినిమా విడుదలైన ప్రతిసారీ నెగిటివ్‌ ప్రచారం చేస్తుంటారు. సంక్రాంతి సందర్భంగా ఈ రోజు మహేష్‌ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమాలను నిషేధించాలి…సినిమా వాళ్లు రోడ్డు మీదకు రావాలి అని పిలుపునిస్తూ…మహేష్‌ ఇంటి ముందు రచ్చ చేశారు..తెలుగు తమ్ముళ్లు…!

నెక్ట్స్‌ చిరునే…!

తెలుగుదేశం పార్టీకి చిరంజీవిపై ఉన్న ద్వేషం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో తమ ఆధిపత్యానికి గండికొట్టిన చిరును చూస్తే కొంత మందికి ఎక్కడాలేని కోపం..! అందుకే ఆయన పార్టీ పెట్టినప్పుడు కొన్ని తోక పత్రికలతో చిరంజీవిపై విషం చిమ్మించారు…! చిరంజీవి అది మనసులో పెట్టుకున్నారో ఏమో జగన్‌ సీఎం అయిన తర్వాత ఆయన్ను ఇంటికెళ్లి మరీ అభినందించారు. అంతటితో ఆగకుండా తాజాగా జగన్‌ మూడు రాజధానుల ప్రకటనను సైతం స్వాగతించారు. దీంతో టీడీపీతోపాటు ఓ సామాజికవర్గానికి చెందిన నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు ఆయనపై రగలిపోతున్నట్లు సమాచారం. పైగా దాసరి మరణించిన తర్వాత అందరూ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చిరంజీవినే గుర్తిస్తూ…అన్ని విషయాలకు ఆయన వద్దకే వెళ్తున్నారు. చిరు సైతం వెళ్లిన వారిని నిరుత్సాహపరచకుండా పెద్దరికం నెరుపుతున్నారు. ఈ వ్యవహారం ఇండస్ట్రీలో ఓ వర్గానికి అస్సలు నచ్చట్లేదు. దీంతో టీడీపీ అమరావతి బురదను నేడో రేపో చిరంజీవికీ పూస్తుందనడంలో సందేహం లేదు..!

టార్గెట్‌ ఆ రెండు చిత్రాలేనా….

ఈ సంక్రాంతికి మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్‌ అల వైకుంఠపురములో, కళ్యాణ్‌రామ్‌ ఎంత మంచివాడవురా..చిత్రాలు విడుదలవుతున్నాయి. వీటిలో కృష్ణ ఫ్యాక్టర్‌తో మహేష్‌ చిత్రాన్ని, చిరంజీవి ఫ్యాక్టర్‌తో అల వైకుంఠపురములో చిత్రాన్ని ఆపాలని తెలుగుదేశం చూస్తుందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇక బరిలో ఉన్న మూడో చిత్రం కథానాయకుడు కళ్యాణ్‌రామ్‌ నందమూరి వంశానికి చెందిన వాడే అయినా…ఆయన హరికృష్ణ కొడుకాయే…..! పైగా కళ్యాణ్‌రామ్‌ తుమ్మడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు సన్నిహితుడు కొడాలి నాని వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు…మరో సన్నిహితుడు వల్లభనేని వంశీ సైతం టీడీపీకి తిలోదకాలు ఇచ్చారు. దీంతో కళ్యాణ్‌రామ్‌ చిత్రాన్ని టీడీపీ వాళ్లు పట్టించుకోవడం లేదు.

బాలకృష్ణ చిత్రం ఉండుంటే…!

బాలకృష్ణ తాజా చిత్రం రూలర్‌ డిసెంబర్‌లో విడుదలై డిజాస్టర్‌గా మిగిలింది..! అలా కాకుండా బాలకృష్ణ చిత్రం సైతం సంక్రాంతి బరిలో ఉండి ఉంటే…తెలుగు తమ్ముళ్లు, టీడీపీ నాయకత్వం ఈ విధంగానే వ్యవహరించేదా…? బాలకృష్ణ కంటిలో కన్నీళ్లకు బదులు మరేదైనా చూసేవారా…? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పండక్కి బాలకృష్ణ సినిమా లేదు కాబట్టే ఓ వర్గం సినీ ఇండస్ట్రీపై మాటల దాడితోపాటు ప్రత్యేక్ష కార్యచరణకు దిగిందనేది సుస్పష్టం.

పవన్‌ కళ్యాణ్‌ రియాక్షన్‌….

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే అయినా…పెద్దగా ఇండస్ట్రీ వ్యవహారాల్లో తలదూర్చింది లేదు. ఆ మధ్య తన తల్లిని తిట్టించారనే కారణంతో ఆయన ఓ ప్రసార మాధ్యమానికి వ్యతిరేకంగా ఫిల్మ్‌చాంబర్‌ వద్ద నిరసన తెలిపిన సంగతి తెలిసిందే..! అయితే సినీతల్లిగా పిలుచుకొనే ఇండస్ట్రీపై నేరుగా ఓ వర్గం చేస్తున్న దాడిపై పవన్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి…!

కేసీఆర్‌ చెంచాలంటూ విమర్శలు…

సినీ పరిశ్రమపై టీడీపీ విమర్శలు ఇప్పుడు కొత్తేం కాదు…! గతంలో ప్రత్యేక హోదా ఉద్యమం జరిగిన సమయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్రప్రసాద్‌ ఇండస్ట్రీపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు చెంచాలు, చవటలు అంటూ పాండిత్యాన్ని ప్రదర్శించారు. దీనంతటికీ కారణం ప్రస్తుతం సినీ పరిశ్రమ టీడీపీ అడుగులకు మడుగులొత్తకపోవడమే. కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి అండగా నిలబడటంతోపాటు అనవసర విషయాల్లో వేలుపెట్టట్లేదు. దీంతో పరిశ్రమలోని చాలా మందికి తెలంగాణ ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడింది. అటు చూస్తే ఏపీలోని గత టీడీపీ ప్రభుత్వం నంది అవార్డులన్నీ బాలకృష్ణ నటించిన లెజెండ్‌కు, రాఘవేంద్రరావు, రామోజీరావులకు ప్రత్యేక ఆసక్తులున్న బహుబలికే పంచిపెట్టారు. పైగా ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి గుణశేఖర్‌ నిర్మించిన రుద్రమదేవికి పన్ను రాయితీ ఇవ్వని చంద్రబాబు సర్కార్‌…బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇచ్చింది. కాబట్టి తెలుగు తమ్ముళ్లుకు తోడుగా అమరావతి వీధుల్లో ఉద్యమం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు భాలకృష్ణ తదితరులపైనే ఉందని ఇండస్ట్రీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి