iDreamPost

IPL 2024: ప్లే ఆఫ్ కు వెళ్లలేరు.. ఆ ఒక్క పనైనా చేయండి! ముంబైకి టీమిండియా దిగ్గజం రిక్వెస్ట్! 

ముంబై ఇండియన్స్ ఎలాగూ ప్లే ఆఫ్ కు వెళ్లలేరు కాబట్టి.. ఆ ఒక్క పని చేసైనా పుణ్యం కట్టుకోండి అంటున్నాడు టీమిండియా మాజీ దిగ్గజం వసీం జాఫర్. మరి అతడు ముంబైని చేయమంటున్న ఆ ఒక్క పని ఏంటి? 

ముంబై ఇండియన్స్ ఎలాగూ ప్లే ఆఫ్ కు వెళ్లలేరు కాబట్టి.. ఆ ఒక్క పని చేసైనా పుణ్యం కట్టుకోండి అంటున్నాడు టీమిండియా మాజీ దిగ్గజం వసీం జాఫర్. మరి అతడు ముంబైని చేయమంటున్న ఆ ఒక్క పని ఏంటి? 

IPL 2024: ప్లే ఆఫ్ కు వెళ్లలేరు.. ఆ ఒక్క పనైనా చేయండి! ముంబైకి టీమిండియా దిగ్గజం రిక్వెస్ట్! 

ఐపీఎల్ 2024లో స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక ఇంటిదారి పట్టింది ముంబై ఇండియన్స్. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ ల్లో 3 విజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలను జీరో చేసుకుంది. ఇక ముంబై వైఫల్యానికి కారణం ఏంటంటే? తలా ఒక్కటి చెబుతున్నారు దిగ్గజాలు. పాండ్యా కెప్టెన్సీ అని ఒకరంటే.. ఆటగాళ్ల వైఫల్యం అని మరోకరు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఎలాగూ ప్లే ఆఫ్ కు వెళ్లలేరు కాబట్టి.. ఆ ఒక్క పని చేసైనా పుణ్యం కట్టుకోండి అంటున్నాడు టీమిండియా మాజీ దిగ్గజం వసీం జాఫర్. మరి అతడు ముంబైని చేయమంటున్న ఆ ఒక్క పని ఏంటి?

టీమిండియా మాజీ దిగ్గజం వసీం జాఫర్ ముంబై ఇండియన్స్ కు ఓ రిక్వెస్ట్ పంపాడు. అదేంటంటే? తాజాగా కేకేఆర్ పై ఓడిపోయిన తర్వాత ముంబైకి ప్లే ఆఫ్ ఆశాలు పూర్తిగా మూతపడ్డాయి. దాంతో ఆ జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి  ఇవ్వాలని ముంబై యాజమాన్యానికి సూచించాడు. “మీరు ఎలాగూ ప్లే ఆఫ్ కు వెళ్లడం లేదు. కాబట్టి బుమ్రాకు కావాల్సినంతగా రెస్ట్ ఇవ్వండి.  దీంతో అతడు టీ20 వరల్డ్ కప్ లో తిరిగి సత్తా చాటడానికి ఉపయోగపడుతుంది. ఇది టీమిండియాకు మంచిది. విరామం లేకుండా మ్యాచ్ లు ఆడటం వల్ల బుమ్రాపై ఒత్తిడి పెరిగే ఛాన్స్ లు ఉన్నాయి. దాని ప్రభావం వరల్డ్ కప్ పై పడితే ఇబ్బందులు తప్పవు” అంటూ ముంబై యాజమాన్యానికి సూచించాడు.

అదీకాక బుమ్రా వరల్డ్ కప్ లో టీమిండియా బౌలింగ్ దళానికి నాయకత్వం వహించాల్సి ఉంటుంది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌తో కూడిన బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను బుమ్రా లీడ్ చేయాల్సి ఉంటుంది.  ఇక ఇప్పటికే ఐపీఎల్ ద్వారా కొంత బుమ్రా కొంత ఒత్తిడికి గురై ఉంటాడు, ఇప్పుడు అతడికి రెస్ట్ ఇస్తే వరల్డ్ కప్ వరకు పుంజుకుంటాడు అంటూ జాఫర్ చెప్పుకొచ్చాడు. జాఫర్ మాటలు కూడా నిజమే అంటున్నారు క్రీడా పండితులు, క్రికెట్ లవర్స్. మరి వసీం జాఫర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి