iDreamPost

జడ్పీ రిజర్వేషన్లలో మార్పు.. కోర్టులో నిలబడతాయా.. ?

జడ్పీ రిజర్వేషన్లలో మార్పు.. కోర్టులో నిలబడతాయా.. ?

స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను ఎస్సీ మహిళ నుంచి జనరల్‌కు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు ఖారరు చేసి, ధర్మాసనం ముందుంచిన తర్వాత ఆ రిజర్వేషన్లలో మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల రాజకీయాలు ఆసక్తిగా మారాయి.  

Read Also: ముగిసిన హైపవర్‌ కమిటీ సమావేశం – స్పష్టత ఇచ్చిన మంత్రి పేర్ని నాని

రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ, ఆ వివరాలతో ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ప్రమాణపత్రం సమర్పించింది. ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08, బీసీలకు 34 శాతం చొప్పున 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 13 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఎస్టీ సామాజిక వర్గానికి ఒకటి, ఎస్సీలకు రెండు, బీసీలకు నాలుగు చొప్పున కేటాయించిన ప్రభుత్వం మిగతా ఆరు స్థానాలను జనరల్‌ కేటగిరిలో ఉంచింది.

రాష్ట్ర ప్రభుత్వం మొదట.. నెల్లూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎస్టీలకు, అనంతపురం ఎస్సీ, విజయనగరం ఎస్సీ మహిళ, చిత్తూరు, కృష్ణా జిల్లా పరిషత్‌లు బీసీ, విశాఖపట్నం, పశ్చిమగోదావరి బీసీ మహిళ, శ్రీకాకుళం, వైఎస్సార్‌ కడప, ప్రకాశం జిల్లా పరిషత్‌లు జనరల్, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు జిల్లా పరిషత్‌లు జనరల్‌ మహిళలకు రిజర్వ్‌ చేసింది. అయితే ఎస్సీలకు కేటాయించిన విజయనగరం జిల్లా పరిషత్‌ను తాజాగా జనరల్‌గా మార్చారు. జనరల్ లో ఉన్న శ్రీకాకుళం స్థానాన్ని ఎస్సి మహిళ గా మార్చారు.

కోర్టులో నిలబడతాయా..?

2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ, ఎస్టీ, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85 శాతం ఇవ్వడంపై న్యాయవాది కొరపాటి సుబ్బారావు, తదితరులు హైకోర్టులో కేసు వేశారు. అయితే దీన్ని న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు అతను సిద్ధమవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి