iDreamPost

అలవైకుంఠపురము చూయించిందీ నేనే, కుచేలుని వేషమున జోలెత్తినదీ నేనే .

అలవైకుంఠపురము చూయించిందీ  నేనే, కుచేలుని వేషమున జోలెత్తినదీ  నేనే .

పెద్దలు , మేధావులు , అనుభవజ్ఞులు మొదట్నుండీ మొత్తుకొంటుంది ఈ విషయం పైనే , రాజధాని ఏ ఒక్కరిదో , లేదా కొందరు సమూహానిదో , ఓ వర్గానిదో కారాదు . దురదృష్టవశాత్తు అమరావతిలో అదే జరుగుతోంది అని.

రాష్ట్రానికి సంబంధించిన రాజధాని విషయంలో ఒకరి పొట్ట గొట్టి మరొకరి పొట్ట నింపడం అనే ప్రస్తావన ఎందుకొస్తుంది . చంద్రబాబు భూసేకరణ చట్టం ప్రకారం భూమి సేకరించి తగు పరిహారం ఇచ్చింటే అసలు ఈ వివాదం ఉండేదా. మెజారిటీ ప్రజలకు ఇష్టమైతే భూములిచ్చి పరిహారం , పునరావాసం తీసుకొని వెళ్లిపోయేవారు . లేదా ఇవ్వకుండా వ్యవసాయం చేసుకొనే వారు.

అలా కాకుండా మీ వద్ద అంతర్జాతీయ స్థాయి రాజధాని కడతాను , మిమ్మల్ని అందళమెక్కిస్తాను దాంట్లో మీకు అభివృద్ధి చేసిన ప్లాట్స్ ఇస్తాను అని చెప్పి పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపార తరహాలో ప్రయివేటు లావాదేవీల లాగా అగ్రిమెంట్స్ చేసుకొని భూమి తీసుకొంది ఎవరూ రాష్ట్ర ప్రభుత్వమా , టీడీపీ రియల్ ఎస్టేట్ కంపెనీనా అన్నది రాష్ట్ర ప్రజలకు తెలిసిన సత్యమే.

పోనీ అగ్రిమెంట్ లో వారికిచ్చిన హామీల ప్రకారం రాజధానిని నిర్మించారా అంటే అదీ లేదు , డెవలప్ చేసిన ప్లాట్స్ ఇచ్చారా అంటే కాగితాల మీద తప్ప నేల మీద అవెక్కడున్నాయో , వాటి హద్దులేమిటో తీసుకొన్న వారికి తెలీదు . భూ సమీకరణ ఆది నుండీ బాబు గారు దిగిపోయే వరకూ రాజధాని విషయంలో రైతుకి ప్రభుత్వానికి మధ్య వ్యవహారాల్లో వివాదం లేని అంశం ఒక్కటైనా ఉందా అంటే లేదనే చెప్పొచ్చు.

ప్రభుత్వ పరిధి దాటి పక్కా వ్యాపారస్తుడిలా వారికి ఆశలు కల్పించింది బాబు గారే , వారితో అగ్రిమెంట్ అయ్యి భూములు తీసుకొని చట్ట ప్రకారం పరిహారం ఇవ్వకుండా మోసం చేసిందీ బాబు గారే ,డెవలప్ చేసిన ప్లాట్స్ ఇస్తానని చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ఇవ్వకుండా అగ్రిమెంట్ మీరింది బాబు గారే ,రాష్ట్ర ఆర్ధిక స్థితి తెలిసి కూడా ప్రజలకి అలవికాని రాజధాని ఆశ చూపించి చివరికి తాత్కాలిక కట్టడాలకే పరిమితమయ్యి విఫలుడు అయ్యిందీ బాబు గారే, ఈ రోజు రాజధాని అక్కడ కట్టలేమని వైజాక్ బాటని ఎంచుకున్న జగన్ ని మా గతి ఏంటని ప్రశ్నిస్తున్న భూములిచ్చిన వారికి సమాధానం చెప్పాల్సినదీ బాబు గారే.

ఇన్ని పాపాలు చంకన బెట్టుకొన్న ఏ నాయకుడు అయినా మొహం చాటేస్తాడు . పాపం బాబు గారికి ఆ అవకాశం కూడా లేనట్లుంది. ఇంసైడర్నో ఔట్ సైడర్నో కానీ బాబు గారిని నమ్మి భూములు కొన్న నాయకుల ఒత్తిడితో తాను వంచించిన అమరావతి రైతులతో కలిసి అమరావతి పొట్ట గొట్టొద్దు అని ధర్నాలు చేసే దుర్గతి పట్టింది. జోలె కూడా పట్టే పరిస్థితి వచ్చింది.

రాజధాని రైతులు చంద్రబాబు కొత్త నాటకాన్ని నమ్ముతారా?ఆ రైతులు తనను ప్రశ్నించకుండా సమస్యను పక్కదారి పట్టించటానికే ఇప్పుడు రైతుల కోసం అంటూ చంద్రబాబు జోలె పట్టారా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి