రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. అది నిజమేనని అనేకసార్లు రుజువైంది. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల మాదిరిగా.. రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కూడా మారిపోతుంటాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పొత్తు పెట్టుకుని,ఆ తంతు కాస్త అయిపోయిన తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటుంటారు. మరికొన్ని పార్టీలు పాత మిత్రులను వదిలేసి.. కొత్త మిత్రులతో స్నేహం చేస్తుంటాయి. అలాంటి పార్టీల అధినేతలపై పాత మిత్రులు గుర్రుగా ఉంటుంటారు. ఈ తరహాకు చెందిన పార్టీలే జనసేన, […]
2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం అందరికీ విడ్డూరంగా అనిపించింది. కలిసి కార్యక్రమాలు చేస్తామని అప్పట్లో టీడీపీ, జనసేన నేతలు ప్రకటించారు. అయితే పొత్తు పెట్టుకుని రెండున్నరేళ్లు అయినా.. ఆ రెండు పార్టీలు పొత్తులో ఉన్నట్లు ఎక్కడా అనిపించలేదు, కనిపించలేదు. ముఖ్యంగా జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో లేమన్నట్లుగానే వ్యవహరించింది. బీజేపీ మాత్రం జనసేనతో కలసి 2024లో అధికారంలోకి వస్తామని […]
తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ-జనసేన కూటమి భవితవ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి తానే ప్రత్యామ్నాయమని చాటుకోవాలని తపించిన బీజేపీ అందుకు జనసేనపైనే పూర్తిగా ఆధారపడింది. అయితే ఆశించినంత సహకారం అటువైపు నుంచి లభించలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ తీరుతో మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ నుంచి కూడా […]
భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయంటే.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై అంచనాలు పెరిగాయి. పవన్ చరిస్మా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గాలితో గట్టి పోటీ ఖాయమని అంతా భావించారు. పొత్తులో భాగంగా రెండు పార్టీలూ ప్రచారంలో ఎంతలా అదరగొడతాయోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూశారు. పవన్ కల్యాణ్ ప్రజల్లో కలియతిరిగి బీజేపీ అభ్యర్థి ప్రచారానికి ఓ ఊపు తెస్తారని అటు బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ ఏర్పడింది. కానీ మొత్తంగా బీజేపీ – […]
తిరుపతి ఉప ఎన్నికపై కమలదళంలో ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. జనసేన పార్టీతో సంబంధం లేకుండానే ఆ పార్టీ అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేసింది. దీంతో జనసేన, బీజేపీ మధ్య తెలంగాణాలో ఏర్పడిన వివాదం ఏపీలోనూ రాజుకుంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ నుండి ఎవరు పోటీ చేస్తారనే అంశానికి తెరపడింది. పోటీకి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు మాజీ ఐఏఎస్ల కుర్చీలాటకి తెరపడింది. ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్న దాసరికి శ్రీనివాసులు, రత్నప్రభ, మాజీ […]
బిజెపి, జనసేన మధ్య ఏర్పడిన మాటల యుద్ధం రాజకీయాల్లో కాక రేపుతుంది. తిరుపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ని నిలబెట్టిన తర్వాత దానికి మద్దతు పలికిన జనసేన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే తన స్వరాన్ని మార్చింది. దీంతో బిజెపి, జనసేన మధ్య ఏర్పడిన మైత్రి మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. జనసేన, బిజెపి నేతల వ్యాఖ్యలు చూస్తే అలాగే కనిపిస్తోంది. చిచ్చుపెట్టిన తెలంగాణ ఎన్నికలు బిజెపి జనసేన మధ్య తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు చిచ్చురేపాయి. […]
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేయడం, ఆ పార్టీకి జనసేన మద్ధతు తెలపడం ఖాయమైంది. శుక్రవారం బీజేపీ, జనసేన అగ్రనేతలు ఈ విషయంపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో దాదాపు మూడు నెలలుగా బీజేపీ, జనసేన పార్టీలలో ఏ పార్టీ అభ్యర్థి తిరుపతిలో పోటీ చేస్తారనే ప్రచారానికి ఫుల్స్టాఫ్ పడింది. అయితే ఇప్పుడు మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. బీజేపీ తరఫున ఎవరు పోటీ చేస్తారు..? ఆ పార్టీ అభ్యర్థిత్వాన్ని […]
ప్రస్తుతం ఏపీలో తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక రాజకీయాల్లో హీట్ను పెంచుతోంది. సహజంగా అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య ఈ హీట్ ఏర్పడడం సహజం. కానీ తిరుపతి ఉప ఎన్నిక మాత్రం ప్రతిపక్షాల మధ్యనే వేడికి కారణమవుతోంది. ప్రస్తుతం ఏపీలో అధికారిక ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. అనధికారిక ప్రతిపక్షంగా బీజేపీ–జనసేనలు వ్యవహరించేస్తున్నాయి. అధికార వైఎస్సార్సీ తరఫున ఇప్పటికే అభ్యర్ధిని ఖరారు చేసి, ఆ తరువాత కార్యక్రమాల్లో ఆ పార్టీ నేతలు మునిగిపోయారు. కానీ టీడీపీ తరపున ప్రకటించిన అభ్యర్ధి […]
తాడిచెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడకు గడ్డి కోయడానికి అన్నాడట. తాడిచెట్టుకు, గడ్డికి సంబంధం లేకపోయినా ఏదోటీ సాకు చెప్పి తప్పించుకోవడమే అక్కడ ప్రధానోద్దేశ్యం అన్నమాట. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసి సత్తాచాటాలని జనసేన అధి నేత పవన్ కళ్యాణ్ ఉవ్విళ్లూరుతూ వచ్చారు. అయితే ఆయన ఆశలపై బీజేపీ నీళ్లు జల్లేసింది. హైదరాబాద్ […]
రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. అందుకే రాజకీయాల్లో సాధ్యం కానిది ఏదీ లేదంటారు. ఈ క్రమంలోనే అంతుచిక్కని అంశాలు చాలా ఉంటాయి. అలాంటి అంతుచిక్కని అంశాలలో ప్రస్తుతం బీజేపీ, జనసేన పార్టీల మధ్య ఉన్న పొత్తు కూడా ఒకటి. 2019 సాధారణ ఎన్నికలలో వేర్వేరుగా పోటీ చేసిన బీజేపీ, జనసేన పార్టీలు.. ఎన్నికలు ముగిసిన తర్వాత కొద్ది నెలలకే పొత్తు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత పొత్తు వల్ల ప్రయోజనం ఏమిటన్నవారికి.. […]