iDreamPost
android-app
ios-app

ఈ వారం థియేటర్స్ ను ఆక్యుపై చేయించేదెవరు ?

  • Published Nov 05, 2025 | 12:19 PM Updated Updated Nov 05, 2025 | 12:19 PM

సెప్టెంబర్ తర్వాత మళ్లీ థియేటర్స్ అన్ని బోసిపోయాయి. సంక్రాంతికి ఎలాగూ అన్ని హౌస్ ఫుల్ అవుతాయి. కానీ ఈ రెండు నెలలు మాత్రం కాస్త కష్టంగానే గడిచేలా ఉంది. అయితే దానిలో డిసెంబర్ కాస్త బెటర్. ఎందుకంటే డిసెంబర్ కు బాలయ్య ఉన్నాడు. ఎటొచ్చి నవంబర్ లోనే థియేటర్స్ ను ఆక్యుపై చేయించేదెవరు అనేది ప్రశ్నగా మారింది.

  • Published Nov 05, 2025 | 12:19 PMUpdated Nov 05, 2025 | 12:19 PM
ఈ వారం థియేటర్స్ ను ఆక్యుపై చేయించేదెవరు ?

సెప్టెంబర్ తర్వాత మళ్లీ థియేటర్స్ అన్ని బోసిపోయాయి. సంక్రాంతికి ఎలాగూ అన్ని హౌస్ ఫుల్ అవుతాయి. కానీ ఈ రెండు నెలలు మాత్రం కాస్త కష్టంగానే గడిచేలా ఉంది. అయితే దానిలో డిసెంబర్ కాస్త బెటర్. ఎందుకంటే డిసెంబర్ కు బాలయ్య ఉన్నాడు. ఎటొచ్చి నవంబర్ లోనే థియేటర్స్ ను ఆక్యుపై చేయించేదెవరు అనేది ప్రశ్నగా మారింది. రీసెంట్ గా రిలీజ్ అయినా మాస్ జాతర తేలిపోయింది. దీనితో థియేటర్స్ లో ఆక్యుపెన్సీలు తగ్గిపోయాయి.

ఇక ఈ వారం సినిమాల విషయానికొస్తే.. నవంబర్ 7 న ఏకంగా అరడజను సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. వీటిలో ఏది థియేటర్స్ లో ఆక్యుపెన్సీ పెంచబోతుంది అనేది బయ్యర్ వర్గాల్లో ఆసక్తి నింపుతుంది. అన్నిటికంటే ఎక్కువగా రష్మిక మందన్న మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ మీద బజ్ బాగా ఉంది. ఏదో డిఫరెంట్ లవ్ స్టోరీ అంటున్నారు కాబట్టి అది కనక కనెక్ట్ అయితే బానే ఉంటుంది. ఇక ఆ తర్వాత బజ్ ఉన్నా సినిమా సుధీర్ బాబు జటాధరా. ఈ సినిమాకు చాలా ఖర్చు చేశారు. ప్రస్తుతానికి ఓపెనింగ్స్ తెచ్చే అంత బజ్ లేకపోయినా. రిలీజ్ తర్వాత మౌత్ టాక్ బావుంటే ఆక్యుపెన్సీ పెరగొచ్చు.

ఈ రెండు కాకుండా తిరువీర్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ప్రీ వెడ్డింగ్ షో’ , తమిళ డబ్బింగ్ ‘ఆర్యన్’, ప్రేమిస్తున్నా, కృష్ణ లీల అనే చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. మరి వీటిలో ఏ సినిమాలు ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.