Swetha
చాక్లేట్ బాయ్ రామ్ పోతినేనికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. కొన్నాళ్ళు రామ్ చేసిన మూవీస్ అన్ని కూడా ప్రేక్షకులను బాగానే ఇంప్రెస్ చేసాయి. కానీ ఆ తర్వాత రామ్ రూటు మార్చి మాస్ సినిమాలు చేసాడు. కానీ అవి ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి అన్నది వాస్తవం. దీనితో మరోసారి రామ్ గేరు మార్చి 'ఆంధ్రా కింగ్ తాలూకా ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు

చాక్లేట్ బాయ్ రామ్ పోతినేనికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. కొన్నాళ్ళు రామ్ చేసిన మూవీస్ అన్ని కూడా ప్రేక్షకులను బాగానే ఇంప్రెస్ చేసాయి. కానీ ఆ తర్వాత రామ్ రూటు మార్చి మాస్ సినిమాలు చేసాడు. కానీ అవి ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి అన్నది వాస్తవం. దీనితో మరోసారి రామ్ గేరు మార్చి ‘ఆంధ్రా కింగ్ తాలూకా ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీనికి బయో పిక్ ఆఫ్ ఆ ఫ్యాన్ అనే ట్యాగ్ లైన్ ను కూడా జోడించారు.
ఇప్పటివరకు మూవీకి సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా బాగానే అనిపించింది. దానిని బట్టి చూస్తే ఓ హీరో ఫ్యాన్ అయినా రామ్ చుట్టూ మూవీ స్టోరీ ఉండబోతుందని అర్ధమౌతుంది. ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహించాడు. నవంబర్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే సాధారణంగా ఈ మధ్య కాలంలో ప్రీమియర్స్ అంటే రిస్క్ గానే భావిస్తున్నారు. సరే ఒకవేళ వేద్దాం అనుకున్నా లెక్క ప్రకారం రిలీజ్ కు ముందు రోజు రాత్రి నుంచి ఈ షోస్ మొదలవుతాయి.
కానీ ఆంధ్ర కింగ్ తాలూకా టీం మాత్రం ఏకంగా రెండు రోజుల ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంటే బుధవారం అర్ధరాత్రి నుంచి షోస్ పడిపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కంటే ఒక రోజు ముందే టాక్ బయటికి వచ్చేస్తుంది. సో టాక్ బావుంటే పరవాలేదు కానీ.. ఒకవేళ అటు ఇటు అయితే మాత్రం మొదటి రోజే ఓపెనింగ్స్ డౌన్ అయిపోతాయి. రామ్ ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నాడు అనేదే ఇప్పుడు అందరి ప్రశ్న. ఒకవేళ సినిమా మీద మూవీ టీం కు ఉన్న నమ్మకమే ఇలాంటి డేర్ చేసేలా చేసిందేమో చెప్పలేము. ఒకవేళ సక్సెస్ అయితే అంతా బాగానే ఉంటుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.