ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చిలక పలుకులు పలుకుతున్నారు. నిజాలను బయటికి చెప్పలేక, రాజకీయంగా ఎదుర్కోలేక పస లేని విమర్శలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నింటిలోనూ అసమర్థుడంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రజలను స్వేచ్ఛగా ఓట్లు వేయనీయకుండా వాలంటీర్లను ఉపయోగించుకుని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.అంతేకాదు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా వైసీపీ నేతలు ఎదుర్కోలేకపోతున్నారని కామెడీ కామెంట్లు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని, బీజేపీ, జనసేన […]
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెల్ స్టూడియోలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డిపై జరిగిన దాడి మీడియా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చర్చ కార్యక్రమంలో లైవ్‌లోనే మాటా మటా పెరిగి అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డిపై చెప్పు దాడి చేశారు. ఈ ఘటన ప్రజలందరూ వీక్షించారు. ఈ ఘటన కొందరి ప్రొద్భలంతోనే జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. చర్చ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉన్న జర్నలిస్ట్ […]
ఏపీ బీజేపీపై ఒత్తిడి పెరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఇంకా ఎన్నికలు సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే పెరగడం ఎందుకు మొదలైందన్నదానికి తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికను కారణంగా చూపుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటి వరకు తెలంగాణా బీజేపీ రెండు ఎన్నికలను ఎదుర్కొంది. దుబ్బాక ఉప ఎన్నికతోపాటు, జీహెచ్‌యంసీ ఎన్నికలు ఈ రెండూనూ. వాటిలో దుబ్బాకలో అనూహ్య విజయం దక్కించుకోగా, జీహెచ్‌యంసీలో కూడా అధికార పార్టీ కంటే కేవలం పదిశాతం ఓట్లు మాత్రమే వెనకబడి ప్రత్యర్ధులకు […]
వరుస విజయాలతో తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ లోనూ పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తోంది. గ్రేటర్ లో అనూహ్య విజయం సొంతం కావడంతో బీజేపీ శ్రేణల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. బల్దియాలో బీజేపీని రెండో స్థానానికి చేర్చిన తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో కొత్త అధ్యాయం మొదలైందన్న ఆయన, కుటుంబ పాలనకు అంతం కూడా ఆరంభమైందన్నారు. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ లోనూ కమలం వికసిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. […]
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ ఫలితాలు సాధించడం తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. నాలుగు స్థానాల నుంచి 48 స్థానాలు గెలుచుకునేలా ఐదేళ్లలో బీజేపీ బలపడడం అందరినీ ఆలోచింపజేస్తోంది. బీజేపీ సాధించిన దాదాపు అన్ని సీట్లు గతంలో టీఆర్ఎస్ సాధించినవే అయినా.. కాంగ్రెస్ స్థానం ప్రజలు బీజేపీకి ఇచ్చినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతిపక్ష స్థానం, ఆ తర్వాత అధికారం.. ఇలా తమ పయనం సాగుతుందని బీజేపీ […]
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు యాక్షన్ ఆఫ్ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నట్లు కనిపిస్తున్నాయి. త్వరలోనే భారీ వలసలు ఉంటాయని ప్రకటించిన సోము ఆ దిశగా అడుగులు వేస్తూనే.. ప్రస్తుతానికి జిల్లాల వారీగా భారతీయ జనతా పార్టీని ఉన్న నాయకులు, కార్యకర్తలతోనే బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారితో.. ప్రస్తుతం ఉన్న వారికి మధ్య ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వలసలు ప్రారంభమైతే […]
ఇంట గెలిచి రచ్చ గెలావలి అనేది బాగా ప్రాచూర్యంలో ఉన్న తెలుగు సామెత. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పుడు ఈ సామెతకు తగినట్లుగానే రాజకీయాలు చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు ముందే ఏపీలో ప్రతిపక్ష స్థానం దక్కించుకోవాలని, ఎన్నికల్లో జనసేనతో కలసి అధికారంలోకి రావాలని సోము వీర్రాజుకు ఆ పార్టీ పెద్దలు లక్ష్యం నిర్ధేశించారు. ఇప్పటి వరకూ టీడీపీకి తోక పార్టీగానే రాజకీయాలు చేసిన బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే […]
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించిన బీజేపీ అధిష్టానం, రాష్ట్రంలో పలు నిర్ణయాల విషయంలో ఆయనకే ఫ్రీ హేండ్ ఇచ్చేసారని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర కమిటీలో తనదైన టీమ్‌ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారని చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం సమృద్దిగా ఉండి, రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మొదలు బీజేపీలోనే ఉన్న సోము వీర్రాజు కృషి, పట్టుదలను మళ్ళీమళ్ళీ నిరూపించుకోవాల్సిన ఆగత్యం లేదు. అయితే ఏపీలో మంచి స్థాయికి చేరాలంటే భారీ కసరత్తే అవసరపడుతుంది. వ్యూహంలో భాగంగా […]