iDreamPost
android-app
ios-app

వారణాసి గ్లిమ్ప్స్ లో చూపించిన ఆ దేవత ఎవరంటే !

  • Published Nov 17, 2025 | 4:33 PM Updated Updated Nov 17, 2025 | 4:33 PM

రామాయణ మహాభారతాల గురించి తప్ప మిగిలిన పురాణాల గురించి.. చాలా మందికి అంత లోతుగా తెలియదు. కొన్ని సినిమాలలో కొన్నిటి గురించి దర్శకులు చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రేక్షకులు దానిని ఇంకాస్త లోతుగా పరిశీలిస్తూ ఉంటారు. కల్కి సినిమా సమయంలో చాలా మంది ఇలానే మహాభారతాన్ని ఓసారి తిరగేసారు. అదంతా అయిపోయిన కథ. ఇక ఇప్పుడు వారణాసి విషయానికొస్తే..

రామాయణ మహాభారతాల గురించి తప్ప మిగిలిన పురాణాల గురించి.. చాలా మందికి అంత లోతుగా తెలియదు. కొన్ని సినిమాలలో కొన్నిటి గురించి దర్శకులు చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రేక్షకులు దానిని ఇంకాస్త లోతుగా పరిశీలిస్తూ ఉంటారు. కల్కి సినిమా సమయంలో చాలా మంది ఇలానే మహాభారతాన్ని ఓసారి తిరగేసారు. అదంతా అయిపోయిన కథ. ఇక ఇప్పుడు వారణాసి విషయానికొస్తే..

  • Published Nov 17, 2025 | 4:33 PMUpdated Nov 17, 2025 | 4:33 PM
వారణాసి గ్లిమ్ప్స్ లో చూపించిన ఆ దేవత ఎవరంటే !

రామాయణ మహాభారతాల గురించి తప్ప మిగిలిన పురాణాల గురించి.. చాలా మందికి అంత లోతుగా తెలియదు. కొన్ని సినిమాలలో కొన్నిటి గురించి దర్శకులు చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రేక్షకులు దానిని ఇంకాస్త లోతుగా పరిశీలిస్తూ ఉంటారు. కల్కి సినిమా సమయంలో చాలా మంది ఇలానే మహాభారతాన్ని ఓసారి తిరగేసారు. అదంతా అయిపోయిన కథ. ఇక ఇప్పుడు వారణాసి విషయానికొస్తే.. రాజమౌళి ముల్లోకాలను కాదు ఇంకా చాలా లోకాలను తన గ్లిమ్ప్స్ లో చూపించాడు. అందులో ఒళ్ళు గగ్గురుపరిచే ఓ షాట్ ఉంది. అదేంటంటే.. వణాంచల్‌లోని ఉగ్రబట్టి గుహ అని చూపించాక.. ఆ గుహ లోపల తల లేకుండా ఉన్న దేవత రూపాన్ని భయంకరమైన అవతారంలో చూపించారు.

ఆ దేవత గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.. కొందరికి తెలిసి ఉండొచ్చు. అసలు ఆ దేవత ఎవరు అనే విషయానికొస్తే.. ఆ దేవత పేరు చిన్నమస్తాదేవి. ఆమె పార్వతీదేవి మరొక అవతారం అని చెప్పొచ్చు. ఈ ఒక్క గ్లిమ్ప్స్ లోనే కాకుండా బయట కూడా ఆ దేవతకు సంబందించిన ఆలయాల్లో కూడా ఆమె ఇలాంటి అవతారంలోనే ఉంటుందంట. ఆమె నుంచి తెగిన తల నుంచి.. మూడు రక్తధారలు వస్తుంటాయి. అందులో ఒకటి ఖండిత శిరస్సు నోట్లోకే వెళ్తూ ఉంటుంది. మిగతా రెండు ధారలను ఇంకో ఇద్దరి నోళ్లలోకి వెళ్తుంటాయి. ఆ ఇద్దరు జయ, విజయ అనే దేవతలట. ఆ ఇద్దరిని ఢాకిని, వర్ణిని అనే పేర్లు కూడా ఉన్నాయట.

‘చిన్నమస్తా’లో చిన్న అంటే ఖండించబడిన, మస్తా అంటే తల అని అర్థమట. పార్వతీదేవి ఇలా తలను ఖండించుకోవడం, రక్త ధారలు ఇలా చిమ్మడం.. స్వయంగా పార్వతీదేవితో పాటు దేవతలు రక్తాన్ని తాగడం వెనుక చాలానే కథలు ఉన్నాయి. వాటిలో ఓ కథ ప్రకారం.. పార్వతీ దేవి తన సేవకురాలైన ఢాకిని, వర్ణినిలతో కలిసి ఒక నదిలో స్నానం చేస్తుందట. ఆ సమయంలో ఢాకిని, వర్ణిని తమ ఆకలి తీర్చమని అడిగారట. ఐతే పార్వతీదేవి చుట్టు పక్కల ఎంత వెతికినా తినడానికి ఏమీ దొరకలేదట. సమయానికి ఆహరం దొరకకపోవడంతో ఢాకిని, వర్ణినిల శరీరం నల్లగా మారిపోయిందట.

అప్పుడు ఈ విశ్వానికే జగన్మాత అయినా పార్వతి దేవి మీరు మా ఆకలి తీర్చలేరా అంటే .. పార్వతీదేవి తన శిరస్సును ఖండించుకుని.. అందులోంచి వచ్చే రక్త ధారలతో వారి ఆకలి తీర్చిందట. స్వయంగా తానూ కూడా ఆ రక్తాన్ని తాగిందట. ఇలా ఆ రూపం వెనుక చాలా కథలు ఉన్నాయి. ఇక జక్కన్న వారణాసి కథకు ఆ దేవతకు ఎలాంటి లింక్ చేసాడో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.