Swetha
రాజమౌళి మహేష్ బాబు వారణాసి.. ఎంతలేదన్నా ఓ రెండేళ్ల పాటు ఈ పేర్లు బాగా వినిపిచేస్తాయి. అలాగే మధ్య మధ్యలో లీకులు.. బర్త్ డే లకో పండగలకో మూవీ కొత్త పోస్టర్లు , అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇక రీసెంట్ గా గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. రెండు మూడు రోజుల పాటు సోషల్ మీడియా అంతా ఒకటే మ్యూజిక్. అయితే ఈ గ్యాప్ లో మరో ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

రాజమౌళి మహేష్ బాబు వారణాసి.. ఎంతలేదన్నా ఓ రెండేళ్ల పాటు ఈ పేర్లు బాగా వినిపిచేస్తాయి. అలాగే మధ్య మధ్యలో లీకులు.. బర్త్ డే లకో పండగలకో మూవీ కొత్త పోస్టర్లు , అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇక రీసెంట్ గా గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. రెండు మూడు రోజుల పాటు సోషల్ మీడియా అంతా ఒకటే మ్యూజిక్. అయితే ఈ గ్యాప్ లో మరో ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అసలు ఆ ఫోటో ఏంటి ఆ ఫోటో వెనుక బ్యాక్ స్టోరీ ఏంటో చూసేద్దాం.
నార్మల్ గా షూటింగ్ స్పాట్ లో జక్కన్న పని రాక్షసుడని.. చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడని చాలా మంది హీరోలు చెప్తుంటే విన్నాము. తానూ అనుకున్న షాట్ సరిగ్గా లేకపోతే.. ఎంత పెద్ద స్టార్ ని అయినా సరే ముప్పు తిప్పలు పెడతాడు. కానీ ఇక్కడ మహేష్ జక్కన్న ఫోటో చూస్తే మాత్రం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. మహేష్ స్టేజ్ మీద నిలుచుని నవ్వుతుంటే.. రాజమౌళి ఆయన ముందు తల వంచి వినయంగా ఎదో చెప్తున్నట్లు ఉంది. బహుశా ఇదేమైనా సీన్ రిహార్సల్ ఆ.. లేదంటే మహేష్ యాక్షన్ చూసి ఇంప్రెస్ అయ్యారా అని ఇలా రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
అదంతా పక్కన పెట్టేస్తే.. రాజమౌళికి ఓ అలవాటు ఉంది.. తానూ ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోను ఓ డేమి గాడ్ లా ట్రీట్ చేస్తారు. బాహుబలి ఆర్ఆర్ఆర్ సమయంలో ఆ హీరోలను ఎలా ఆకాశానికి ఎత్తేసారో తెలియంది కాదు. ఇక ఇప్పుడు మహేష్ వంతు వచ్చింది. ఆల్రెడీ గ్లోబ్ ట్రోటర్ లో ఎలాంటి హైప్ ఇచ్చాడో తెలియంది కాదు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.