iDreamPost
android-app
ios-app

ఐ బొమ్మ రవికి సోషల్ మీడియా సపోర్ట్ మంచిదేనా !

  • Published Nov 19, 2025 | 3:37 PM Updated Updated Nov 19, 2025 | 3:37 PM

గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఐ బొమ్మ రవి అరెస్ట్ కు సంబందించిన వార్తలు వింటూనే ఉన్నాము. టాలీవుడ్ అంతా రవి అరెస్ట్ పై సంబరాలు జరుపుకుంటుంటే.. సోషల్ మీడియాలో మాత్రం రవికి సపోర్ట్ చేస్తుంది. ఇది అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.

గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఐ బొమ్మ రవి అరెస్ట్ కు సంబందించిన వార్తలు వింటూనే ఉన్నాము. టాలీవుడ్ అంతా రవి అరెస్ట్ పై సంబరాలు జరుపుకుంటుంటే.. సోషల్ మీడియాలో మాత్రం రవికి సపోర్ట్ చేస్తుంది. ఇది అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.

  • Published Nov 19, 2025 | 3:37 PMUpdated Nov 19, 2025 | 3:37 PM
ఐ బొమ్మ రవికి సోషల్ మీడియా సపోర్ట్ మంచిదేనా !

గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఐ బొమ్మ రవి అరెస్ట్ కు సంబందించిన వార్తలు వింటూనే ఉన్నాము. టాలీవుడ్ అంతా రవి అరెస్ట్ పై సంబరాలు జరుపుకుంటుంటే.. సోషల్ మీడియాలో మాత్రం రవికి సపోర్ట్ చేస్తుంది. ఇది అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఐ బొమ్మ రవి కి సపోర్ట్ చేసేవారిపై కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు ప్రెస్ మీట్స్ లో చెప్పినా కూడా.. సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు.

పైగా ఎవరు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదా ? డబ్బు సంపాదించలేదా ? అంటూ ఐ బొమ్మ రవి సమర్థిస్తున్నారు. ఐ బొమ్మ లాంటి సైట్స్ వలన సినిమా ఇండస్ట్రీకి నష్టం కలిగిందని వారంతా చెబుతున్నా సరే.. సినిమాలు సరిగా లేవు కాబట్టి ఆడలేదని ఇందులో ఐ బొమ్మ తప్పు ఏమి లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వెబ్ సైట్స్ ను తొలగించడం అంత ఈజీ కాదని.. రవి ని అరెస్ట్ చేసినంత మాత్రాన ఇలాంటి పైరసీలు ఆగవని.. సినిమా టికెట్ రేట్స్ తగ్గిస్తే మాత్రమే సినిమాలకు న్యాయం జరుగుతుందని.. అప్పుడు మాత్రమే పైరసిలకు చెక్ పడుతుందని అంటున్నారు.

దీనిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని పక్కనపెడితే.. ఎంతో కష్టపడి , డబ్బు ఇన్వెస్ట్ చేసి కొన్ని వేల మంది కార్మికులు పని చేసిన సినిమాను ఇలా పైరసీ చేసి అందరికి చూపిస్తే. పరుల సొమ్ము దోపిడీ చేసి పంచిపెట్టినట్టే. ప్రస్తుతానికి ఐ బొమ్మ రవి అంతా హీరో అనుకుంటున్నారు కానీ.. ఎండ్ ఆఫ్ ది డే అది తప్పే అని అందరు గుర్తించాలి. సినీ ప్రముఖులు కూడా ప్రజలు చెప్పినట్టు సినిమా టికెట్ ధరలు తగ్గిస్తే బాగానే ఉంటుంది. ఇక ఈ కేసు ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.