Swetha
వాస్తవానికి తమిళ్ హీరోనే అయినా.. తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు కార్తీ. కార్తీ నుంచి ఈ మధ్య కాలంలో ఎలాంటి స్ట్రెయిట్ ఫిలిం రాలేదు. కానీ సిక్వెల్స్ లిస్ట్ మాత్రం చాలానే ఉంది. ఆఖరిగా కార్తీ తెర మీద కనిపించింది నాని హిట్ 3 సినిమాలోనే. ఫోర్త్ పార్ట్ కు లీడ్ ఇస్తూ కార్తీని ఇంట్రొడ్యూస్ చేశారు మేకర్స్. ఇక కార్తీ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో వా వాథియర్ అలాగే సర్దార్ 2 కూడా ఉన్నాయి.

వాస్తవానికి తమిళ్ హీరోనే అయినా.. తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు కార్తీ. కార్తీ నుంచి ఈ మధ్య కాలంలో ఎలాంటి స్ట్రెయిట్ ఫిలిం రాలేదు. కానీ సిక్వెల్స్ లిస్ట్ మాత్రం చాలానే ఉంది. ఆఖరిగా కార్తీ తెర మీద కనిపించింది నాని హిట్ 3 సినిమాలోనే. ఫోర్త్ పార్ట్ కు లీడ్ ఇస్తూ కార్తీని ఇంట్రొడ్యూస్ చేశారు మేకర్స్. ఇక కార్తీ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో వా వాథియర్ అలాగే సర్దార్ 2 కూడా ఉన్నాయి. వీటిలో డైరెక్టర్ లన్ కుమారస్వామి తెరకెక్కిస్తున్న పోలీస్ యాక్షన్ డ్రామానే వా వాథియర్.
ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి కార్తీతో జంట కట్టబోతుంది. కేవలం ఇన్ని రోజులు కేవలం తమిళంలో మాత్రమే ఈ సినిమా అప్డేట్స్ వచ్చాయి. దీనితో ఇంకా తెలుగులో రిలీజ్ లేదని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ లేటెస్ట్ గా ఈ సినిమా తెలుగు టైటిల్స్ ను రివీల్ చేశారు మేకర్స్. అదే “అన్నగారు వస్తారు”. సో ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.