iDreamPost
android-app
ios-app

ఘనంగా “మా రాముడు అందరివాడు” చిత్ర టీజర్, ఆడియో లాంచ్

  • Published Nov 18, 2025 | 2:14 PM Updated Updated Nov 18, 2025 | 2:14 PM

అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ సంయుక్తంగా యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం మా రాముడు అందరివాడు.. త్వరలో ప్రేక్షకులను వెండి తెరపై అలరించనున్న ఈ చిత్ర టీజర్, ఆడియో లాంచ్ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో లాంచ్ కావడం జరిగింది.

అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ సంయుక్తంగా యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం మా రాముడు అందరివాడు.. త్వరలో ప్రేక్షకులను వెండి తెరపై అలరించనున్న ఈ చిత్ర టీజర్, ఆడియో లాంచ్ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో లాంచ్ కావడం జరిగింది.

  • Published Nov 18, 2025 | 2:14 PMUpdated Nov 18, 2025 | 2:14 PM
ఘనంగా “మా రాముడు అందరివాడు” చిత్ర టీజర్, ఆడియో లాంచ్

అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ సంయుక్తంగా యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం మా రాముడు అందరివాడు. శ్రీరామ్, స్వాతి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద్ భారతి, జబర్దస్ అప్పారావు, చిట్టి బాబు, గడ్డం నవీన్, లక్ష్మణ్ రావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. మనిష్ కుమార్ సంగీత దర్శకత్వంలో వినోద్ సినిమాటోగ్రాఫర్ గా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్, డ్రామా, సస్పెన్, ఎమోషన్స్ చిత్రంలో క్యారీ చేస్తూ ఈ చిత్రం రానుంది.

నర్ర సాయికుమార్ కోరియోగ్రఫీ చేయగా గీత మాధురి, రమ్య బెహర, నల్గొండ గద్దర్ నరసన్న, మనీష్ కుమార్ ఈ చిత్రంలోని పాటలను తన స్వరాన్ని అందించారు. త్వరలో ప్రేక్షకులను వెండి తెరపై అలరించనున్న ఈ చిత్ర టీజర్, ఆడియో లాంచ్ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో లాంచ్ కావడం జరిగింది.

ఈ సందర్భంగా నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ముందుగా మంచి టైటిల్ తో ప్రేక్షకుల ముందు రావడం గొప్ప విషయం. చిత్ర పరిశ్రమలో ఎంతో పెద్ద హీరోలు పెట్టుకునే స్థాయిలో ఈ చిత్ర టైటిల్ చాలా బావుంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని, ఈ సినిమాను బాగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా బావుంటే దూసుకెళ్లిపోయే రోజులు. అటువంటి ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను. అలాగే నిర్మాత లక్ష్మణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో గద్దర్ నరసన్న పాట పాడటం ప్రత్యేకం. సినిమా బృందం అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ప్రార్థిస్తున్నాను” అన్నారు.

దర్శకుడు మైకిల్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ సినిమాలోని 4 పాటలు అన్ని నేను రాసాను, దానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ సినిమా కోసం లక్ష్మణ్ గారు ఎంతో పట్టుదలతో నటించారు. హీరో శ్రీరామ్ ఈ సినిమాకు ముందుగా నాంది పలికారు. చాలా కష్టపడి చిన్న స్థాయి నుండి హీరో స్థాయికి వచ్చారు. నటి స్వాతి నవరసాలు పండిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. మా సినిమాను ప్రోత్సహించి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్. అందరూ మా సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత లక్ష్మణ్ రావు మాట్లాడుతూ… “మా చిత్ర టీజర్, ఆడియో లాంచ్ వేడుకకు విచ్చేసిన అందరికీ నా నమస్కారం. ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీరామ్, నటి స్వాతి ఇంకా ఎంతో మంది పేరుగాంచిన నటీనటులకు అందరికీ సినిమాలో నటించినందుకు థాంక్స్. అలాగే దర్శకుడు మైకిల్ తన ప్రాణం పెట్టి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. అలాగే మా కోసం వచ్చిన బాబు మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో కష్టపడి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. మా సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి మంచి విజయాన్ని అందచేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş